T.G. Viswa Prasad: ప్రముఖ సినీ నిర్మాత, పీపుల్ మీడియా అధినేత టి. జి. విశ్వ ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన
మాతృ మూర్తి శ్రీమతి టి జి గీతాంజలి (70) కన్నుమూశారు. గత కొంత కాలంగా వయోవృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను ఇటీవలే బెంగళూరు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఇక ఆమె చికిత్సకు సహకరించడం లేదని వైద్యులు తెలపడంతో ఆమె చివరి కోరికను కొడుకు విశ్వనాధ్ నెరవేర్చాడు. కోలుకోలేని పరిస్థితుల కారణంగా ఆవిడ చివరి కోరిక మేరకు తనయుడు విశ్వప్రసాద్ వారాణాసి తీసుకువెళ్ళారు. అక్కడే దైవ దర్శనం అనంతరం, ఈరోజు ఆవిడ తుది శ్వాస విడిచారు. గీతాంజలి కిభర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. విశ్వప్రసాద్ పెద్దకొడుకు. వారణాసిలో ఆవిడ అంత్యక్రియలు జరుగుతాయని విశ్వప్రసాద్ తెలిపారు.
Pawan Kalyan: చరణ్ కు బాబాయ్ మీద అంత ప్రేమ.. కూతురుకు పవన్ పేరు కలిసేలా పెట్టాడు
ఇక విశ్వప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేతగా ఆయన ఎన్నో మంచి సినిమాలను తెలుగు ఇండస్ట్రీకి అందించారు. ఈ మధ్యనే రిలీజ్ అయిన ఆదిపురుష్ ను తెలుగులో రిలీజ్ చేసిన బ్యానర్స్ లో పీపుల్స్ మీడియా కూడా ఒకటి. ఇక ప్రస్తుతం సగానికి పైగా సినిమాలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలోనే తెరకెక్కుతున్నాయి. పవన్- తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన బ్రో సినిమను సైతం పీపుల్స్ మీడియానే నిర్మించింది. ఇక ఆయన తల్లిగారి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.