ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా రాజాసాబ్. షూటింగ్ స్టార్ట్ చేసి చాలా కాలం అవుతున్న ఈ సినిమా ఇంకా అలానే సాగుతూ.. ఉంది. అదిరిపోయే పాటలు, ఫైట్స్, కామెడీ, డ్యాన్స్‌తో పాటు ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు డార్లింగ్. పైగా ఫస్ట్ హార్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ రాజాసాబ్. ఇన్ని విశేషాలు ఉన్న ఈ సినిమా ఎందుకనో స్టార్ట్ అయిన దగ్గరునుండి రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే రివీల్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వాస్తవానికి ఈ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
Also Read : Bollywood : భారీ బడ్జెట్ సినిమా నుండి కియారా ఔట్.. కృతి సనన్ ఇన్
కానీ ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ పెండింగ్ దశలోనే ఉంది. కానీ మారుతి మాత్రం సమ్మర్‌లో అదిరిపోయే ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. రీసెంట్‌గా మే నెల మిడ్‌లో అప్డేట్స్ ఇస్తామని హింట్ ఇచ్చాడు మారుతి. హై అలర్ట్ మే నెలలో హీట్ వేవ్స్ మరింత పెరగనున్నాయి అని ఒక ట్వీట్ చేశారు. దీంతో ఎలాంటి అప్డేట్ ఇవ్వబోతున్నాడా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రెబల్ ఫ్యాన్స్. అయితే రాజాసాబ్ టీజర్ రిలీజ్‌కు మారుతీ ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం సాలిడ్ టీజర్ కట్ చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ టీజర్‌కు సంబంధించిన గ్రాఫిక్స్ పనులు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. ప్రస్తుతం విదేశాలలో ఉన్న ప్రభాస్ తిరిగి రాగానే తనతో డబ్బింగ్ పూర్తి చేసి టీజర్ విడుదల తేదీని రివీల్ చేస్తారని సమాచారం. అందాల భామలు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.