Bollywood : భారీ బడ్జెట్ సినిమా నుండి కియారా ఔట్.. కృతి సనన్ ఇన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీకి ప్రెగెన్సీ రావడంతో ఓ క్రేజీ ప్రాజెక్టు నుండి తప్పుకోవాల్సి వచ్చింది. పర్హాన్ అక్తర్ తెరకెక్కిస్తున్న డాన్ 3లో రణవీర్ సింగ్‌తో రొమాన్స్ చేసే ఛాన్స్ మిస్సయ్యింది. ఈ ఆఫర్ ఎవరికి దక్కుతుందో అనుకునేలోగా యంగ్ బ్యూటీ శార్వరీ వాఘ్ పేరు గట్టిగానే వినిపించింది. తనే ఫైనల్ కాబోతున్నట్లు ఇక కాల్షీట్స్ రెడీ చేసుకోవడమే అని సంబరపడిపోయింది ముంజ్య బ్యూటీ. కానీ అమ్మడికి ఆ ఛాన్స్ రాలేదు. ఆ ఆఫర్ ఎగరేసుకుపోయింది బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ క్రితి సనన్.
Also Read : Jailer 2 : రజనీ కోసం రంగంలోకి స్టార్ హీరోలు
Also Read
క్రితి సనన్‌ను డాన్ 3 హీరోయిన్‌గా ఫైనల్ చేసిందట టీం. జూనియర్ కన్నా సీనియర్ యాక్ట్రెస్ అయితే బెటర్ అని భావించి క్రితికే ఓటు వేసిందని సమాచారం. షారూఖ్ ప్లేసులోకి రణవీర్ సింగ్ వచ్చినట్లే ఇప్పుడు కియారా ప్లేసును ఆక్యుపై చేసింది మిమి. అక్టోబర్ లేదా నవంబర్‌లో సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ యాక్షన్ పిక్చర్‌గా తెరకెక్కించబోతున్నాడు డైరెక్టర్ పర్హాన్ అక్తర్. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను లైన్లో పెట్టేస్తోంది క్రితి సనన్. ప్రజెంట్ ఆనంద్ ఎల్ రాయ్- ధనుష్ కాంబోలో వస్తున్న తేరే ఇష్క్ మేలో నటిస్తోంది. షాహీద్ కపూర్ సరసన కాక్ టైల్2తో పాటు నయీ నవేలీ అనే హారర్ థ్రిల్లర్‌లోనూ కనిపించబోతుంది. ఇలా వరుస ఆఫర్లను కొల్లగొడుతూ అటు స్టార్ హీరోయిన్లకు ఇటు జూనియర్ భామలకు గట్టిపోటీనిస్తుంది దో పత్తి బ్యూటీ.
తాజావార్తలు
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..