Jamuna:అందాల తార జమున అందరిని వదిలి నింగికేగారు. రెండు రోజుల క్రితమే ఆమె అంత్యక్రియలను ఆమె కుమార్తె స్రవంతి పూర్తి చేసారు. 86 ఏళ్ల వయస్సులో జమున పరమపదించారు. ఇక తెలుగు తో పాటు మిగతా భాషల్లో కూడా జమున నటించి మెప్పించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్ లాంటి స్టార్ హీరోల సరసన ఆమె నటించి మెప్పించింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జమున బయోపిక్ ను తీసే ఆలోచనలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఒకరు ఈ బయోపిక్ బాధ్యతలు స్వీకరించారట. ఆమె ఉన్నప్పుడే ఈ స్క్రిప్ట్ వర్క్ మొత్తం కూడా జరిగిపోయిందట. ఆమె బతికుండానే ఈ బయోపిక్ ము మొదలుపెట్టాలనుకున్నా .. అనుకోకుండా జమున మృతి చెందడం విషాదకరమని తమిళ తంబీలు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ బయోపిక్ లో జమునగా మిల్కీ బ్యూటీ తమన్నా చేస్తున్నట్లు తెలుస్తోంది.
Pawan Kalyan: పవన్ కూతురిగా అల్లు వారసురాలు..?
అందం, అభినయం కలబోసిన రూపం జామున. ఆమె ఆత్మాభిమానం, గొడవలు, ప్రేమ, పెళ్లి .. ఇవన్నీ ఈ బయోపిక్ లో చూపించనున్నారట. జమున పాత్రకు తమన్నా అయితే చక్కగా సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇదే విషయం తమన్నాతో చర్చించగా ఆమెకూడా ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే ఈ బయోపిక్ ఎప్పుడు స్టార్ట్ అవుతోంది. తెలుగులో కూడా రిలీజ్ చేస్తారా..? అనేది తెలియాల్సి ఉంది. ఇక తమన్నా విషయానికొస్తే ప్రస్తుతం చిరంజీవి సరసన భోళా శంకర్ లో నటిస్తోంది. మరోపక్క బాలీవుడ్ లో సైతం పాగా వేయడానికి ప్రయత్నిస్తోంది.