Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ప్రస్తుతం హరిహర వీరమల్లు చిత్రాన్ని పూర్తిచేసే పనిలో ఉన్న పవన్ ఈ సినిమా తరువాత హరిశ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ ను పట్టాలెక్కించనున్నాడు. కోలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకున్న తేరి సినిమాకు అధికారిక రీమేక్ ఇది. తెలుగులో పోలీసోడు పేరుతో రిలీజ్ అయ్యి ఇక్కడ కూడా మంచి విజయాన్నే అందుకుంది. అయితే ఆ సినిమా లైన్ మాత్రమే తీసుకుంటున్నామని, మిగతాది మొత్తం మార్చి చేస్తున్నట్లు మేకర్స్ చెప్పుకొచ్చారు. తేరి లో విజయ్ బేకరీ ఓనర్ గా కనిపించగా.. ఇందులో పవన్ లెక్చరర్ గా కనిపించనున్నాడు. ఇక రెండు సినిమాల్లో తండ్రికూతుళ్ళ ఎమోషన్ మాత్రం కామన్ అని తెలుస్తోంది.
తేరిలో విజయ్ కూతురిగా.. సీనియర్ నటి మీనా కూతురు బేబీ నైనిక నటించి మెప్పించింది. ఇక తెలుగులో ఈ చిన్నారి పాత్ర కోసం చాలామందిని వెతికిన హరీష్.. చివరికి అల్లు వారసురాలిని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ కుమార్తె అర్హ.. ప్రస్తుతం చైల్డ్ ఆర్టిస్ట్ గా శాకుంతలం ద్వారా పరిచయమవుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో చిన్నారి పాత్ర ఎంతో కీలకం.. అందుకోసమే ఒక మంచి ఫ్రెష్ ఫేస్ కోసం చూస్తుండగా.. అర్హ అందుకు బాగా సెట్ అవుతుందని హరీష్ అలోచించి.. బన్నీతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఇక పవన్ సినిమా అనగానే బన్నీ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. అర్హకు పవన్ తెలుసు.. ఆ మెగా కాంపౌండ్ లోనే పెరుగుతున్న చిన్నారి కాబట్టి కొద్దోగొప్పో ఆ బాండింగ్ అనేది ఉంటుంది. దీంతో వారిద్దరి తండ్రి కూతుళ్లుగా సెట్ అవుతారని అభిమానులు సైతం చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.