సౌత్ ఇండస్ట్రీలో బాలీవుడ్ భామలకు ఎప్పుడూ డిమాండే. గతంలో కొత్త వాళ్ళను, కాస్త ఎస్టాబ్లీష్ అవుతున్న ముద్దుగుమ్మలను తెచ్చి ఇక్కడ స్టార్ హీరోయిన్లను చేసేవారు మేకర్స్. కానీ ఇప్పుడు నార్త్ బెల్ట్‌లో ఫేమస్ హీరోయిన్లనే పట్టుకొస్తున్నారు. ఇక ఇదే అదును అనుకుని ముంబయి ముద్దుగుమ్మలు కోర్కెల చిట్టా విప్పేస్తున్నారు. బాలీవుడ్‌లో కూడా లేనంత రెమ్యునరేషన్ ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. పాన్ ఇండియా చిత్రాల మోజులో ఉన్న సౌత్ కూడా బాలీవుడ్ మార్కెట్ టార్గెట్ చేసేందుకు భామలు అడిగనంత ముట్ట చెబుతున్నారు ఫిల్మ్ మేకర్స్
Also Read : Kollywood : హిట్ కాంబో సినిమాకు ఆర్థిక కష్టాలు..
దేవర కోసం జాన్వీకి రూ. 5 కోట్లు ఇచ్చారని టాక్. అలాగే కల్కిలో సుమతి పాత్ర కోసం దీపికా పదుకొనే రూ. 20 కోట్లు చార్జ్ చేసింది. ఇక టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపెటెడ్ మూవీ ఎస్ఎస్ఎంబీ కోసం ప్రియాంక ఏకంగా రూ. 30 కోట్లు తీసుకుంటుందని సమాచారం. అయితే వీరందరి కన్నా సౌత్ ఇండస్ట్రీలోకి నేనే ముందొచ్చా నేనేందుకు డిమాండ్ చేయకూడదు అనుకుందే ఏమో కియారా అద్వానీ కూడా రెమ్యునరేషన్ పెంచేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గేమ్ ఛేంజర్ కోసం రూ. 7 నుండి రూ. 8 కోట్లు తీసుకున్న కియారా.. ఇప్పుడు టాక్సిక్ కోసం ఏకంగా రూ. 15 కోట్లు అంటే డబుల్ చార్జ్ చేస్తుందని గట్టిగా బజ్ నడుస్తోంది. ఈ లెక్కన బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే ప్రియాంక, దీపికా, కంగనాలాంటి హీరోయిన్ల జాబితాలోకి చేరిపోయింది కియారా. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యశ్ నుండి రాబోతున్న ప్రాజెక్ట్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. కియారా అద్వానీతో పాటు నయనతార, హ్యూమా ఖురేషీ, తార సుతారియా లాంటి ముద్దుగుమ్మలు ఆడిపాడుతున్నారు. వీరిందరిలో కియారాకు క్రేజ్ ఎక్కువున్న నేపథ్యంలోనే ఆమెకు రూ. 15 కోట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లు టాక్. మేడమ్ చేతిలో టాక్సిక్ మాత్రమే కాకుండా హృతిక్-తారక్ వార్ 2 కూడా ఉంది.