కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ భారీ ప్రయోగాల జోలికి వెళుతున్నాడు. హీరో మార్కెట్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టించి సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. డైరెక్టర్ గత హిట్టు బొమ్మలను చూసి మేకర్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కానీ తంగలాన్‌తో ఆ ఎక్స్‌పరిమెంట్ బెడిసికొట్టింది. తంగలాన్‌ను రూ. 150 కోట్లు తీస్తే వంద కోట్లు రావడానికి నానా అవస్థలు పడింది. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ పా రంజిత్ అప్ కమింగ్ మూవీలో ఒకటైన సార్పట్ట సీక్వెల్‌పై పడింది.
Also Read : Exclusive: దిల్ రాజుకు హీరోలు కావలెను
ఆటకత్తి, మద్రాస్, కబాలీ, కాలా బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ఆర్యతో స్పారట్ట పరంపరై సినిమా చేశాడు పా రంజిత్. ఓటీటీలో రిలిజ్ అయిన ఈ సినిమా మంచి పేరు తెచ్చుకుంది . ఈ సినిమాకు సీక్వెల్ గా సార్పట్ట 2 ను సుమారు రూ.80 కోట్లతో నిర్మించాలని ప్లాన్ చేసుకున్నారు మేకర్స్. ఈ ప్రాజెక్టుకు ప్రముఖ నిర్మాణ సంస్థ జీతో కలిసి నిర్మిస్తున్నాడు ఆర్య. తనకు అంత మార్కెట్ లేకపోయినా.. పా రంజిత్ పై నమ్మకంతో ఆర్య అంత బడ్జెట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కాగా రీసెంట్లీ ఈ వెంచర్ నుండి జీ తప్పుకున్నట్లు తెలుస్తోంది. తంగలాన్ డిజాస్టర్ తర్వాత పా రంజిత్‌తో భారీ బడ్జెట్ అంటే కాస్త వెనకడుగు వేస్తుందట జీ. దీంతో కొత్త నిర్మాతల కోసం పడిగాపులు కాస్తున్నారట పా రంజిత్ అండ్ ఆర్య. ప్రజెంట్ ఈ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్టువంతో బిజీగా ఉన్నాడు. ఇప్పటి వరకు క్యామియోలతో సరిపెట్టేసిన ఆర్య కూడా ఈ సినిమా కోసం భారీగానే ఖర్చు పెడుతున్నాడు. కానీ ఇంతలో జీ క్విట్ కావడంతో ఆర్థిక కష్టాలు స్టార్టయ్యాయి. దీంతో సినిమా సెట్స్ పై కి వెళ్లడం ఆలస్యమయ్యేట్లే కనిపిస్తోంది. అదే టైంలో సినిమా షెడ్డుకు వెళుతుందన్న టాక్ వినిపిస్తోంది.