Suhas : హీరో సుహాస్ నటించిన తాజా మూవీ ‘ఓ భామ అయ్యోరామ’. మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో వస్తున్న సుహాస్.. ఈ సారి ఓ డిఫరెంట్ లవ్ కాన్సెప్ట్ తో వస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో హీరోయిన్ గా మాళవిక మనోజ్ నటిస్తుండగా.. రామ్ గోదాల డైరెక్ట్ చేస్తున్నారు. మూవీ టీజర్ రిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో ఓ రిపోర్టర్ సుహాస్ ను నీ రెమ్యునరేషన్ ఎంత, యాడ్ కు ఎంత తీసుకుంటున్నారు అని ప్రశ్నించాడు. దానికి సుహాస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఆన్సర్ ఇచ్చాడు.
Read Also : BCCI: మహిళా క్రికెటర్ల కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్‌ల జాబితా విడుదల చేసిన బీసీసీఐ
‘నాకేంటిది టార్చర్ అయిపోయింది. ఎక్కడకు వెళ్లినా ఇదే ప్రశ్న అడుగుతున్నారు. పర్లేదు బాగానే ఇచ్చారు. కాకపోతే నేను అనుకున్న నెంబర్ రాలేదు. యాడ్స్ కూడా కూడా పర్లేదు. కానీ నా యాక్టింగ్ చూడకుండా ఇలా రెమ్యునరేషన్ గురించి అడుగుతున్నారు. నా యాక్టింగ్ గురించి అడిగితే బాగుంటుంది అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఇక స్పిరిట్ మూవీలో ఛాన్స్ గురించి చెప్పాడు. తనకు ఎలాంటి ఆడిషన్ కాల రాలేదని.. ఏదైనా వస్తే చెబుతానన్నాడు. క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో కూడా నటిస్తానని.. మంచి రోల్ కోసం చూస్తున్నానని అన్నాడు.