Sudigali Sudheer: సుడిగాలి సుధీర్, డాలీషా జంటగా అరుణ్ విక్కిరాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాలింగ్ సహస్ర. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధ ఆర్ట్స్ బ్యానర్స్ పై విజేష్ కుమార్ తాయల్, చిరంజీవి పమిడి, వేంకటేశ్వరులు కాటూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ను బట్టి.. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా కనిపిస్తుంది. ఇక ఇందులో సుధీర్.. అజయ్ అనే పాత్రలో కనిపిస్తున్నాడు.
Chatrapathi: సైలెంట్ గా ఓటిటీలోకి దిగిన బెల్లంకొండ ఛత్రపతి..
అజయ్.. ఒక సాఫ్ట్ వేర్.. మంచిగా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసే టైప్. అజయ్ కొత్తగా ఒక సిమ్ కార్డు తీసుకుంటాడు. ఆ సిమ్ యాక్టివ్ అయినప్పటి నుంచి సహస్ర కావాలి అంటూ కాల్స్ వస్తూనే ఉంటాయి. అది సహస్ర నంబర్ కాదని, తాను కొత్త నంబర్ తీసుకున్నట్లు చెప్తాడు. అయినా కూడా ఆ కాల్స్ ఆగవు. అసలు ఎవరీ సహస్ర అనేది.. అజయ్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ నేపథ్యంలోనే ఆ ఫోన్ ను పోలీసులకు అప్పజెప్పడంతో.. అసలు ఆ సిమ్ యాక్టివ్ లోనే లేదని తెలుస్తోంది. ఇదంతా ఒక యాప్ అని, అమ్మాయిలను కిడ్నాప్ చేసి.. వారిని చంపడమే ఒక గేమ్ అని తెలుసుకుంటాడు అజయ్. ఇక ఆ ట్రాప్ లో సహస్ర చిక్కుకుందని తెలుసుకుంటాడు. మరి చివరికి సహస్రను అజయ్ కాపాడాడా.. ? లేదా ..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సుధీర్ స్టైలిష్ లుక్ లో ఆకట్టుకున్నాడు. ట్రైలర్ మొత్తం లో ఒక హీరోగానే హుందాగా కనిపించాడు. ఇక డైలాగ్స్ తో పాటు యాక్షన్ సన్నివేశాల్లో కూడా సుధీర్ అదరగొట్టాడు. చివర్లో భయంలో ఉన్నడోకి బాధ ఉండదు. బాధలో ఉన్నోడికి భయం ఉండదు అనే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సుడిగాలి సుధీర్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.