Chatrapathi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ్లస్టర్ ఛత్రపతి. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2005 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇక దాదాపు 22 ఏళ్ల తరువాత ఈ సినిమాను అదే పేరుతో హిందీలో రీమేక్ చేసారు. కుర్ర హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతి లాల్ గద నిర్మించింది. మే 12 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. కలక్షన్స్ అయితే మరీ దారుణంగా వచ్చాయి. ప్రభాస్ ప్లేస్ లో శ్రీనివాస్ ను ప్రేక్షకులు ఉహించుకోలేకపోయారు. సినిమా స్టార్ట్ అయిన దగ్గరనుంచి రిలీజ్ తరువాత కూడా ట్రోల్స్ వచ్చాయి.
Mansoor Ali Khan: త్రిష పెళ్లి కూతురు.. నేను పెళ్లి కొడుకు.. సారీ ఎందుకు చెప్పాలి..
ఇక ఈ సినిమా ఓటిటీలో వస్తే చూడాలనుకొనేవారు చాలామంది ఉన్నారు. ఆరు నెలలు అయినా కూడా ఈ సినిమా ఓటిటీ గురించి మేకర్స్ అప్డేట్ ఇచ్చిందే లేదు. అయితే ఆరు నెలల తరువాత ఈ సినిమాకు మోక్షం కలిగింది. ఛత్రపతి.. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతూ కనిపించింది. సడెన్ గా ఈ సినిమా చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. చడీచప్పుడు లేకుండా ఈ సినిమా అమెజాన్ లో అడుగుపెట్టడం ఏంటో అని అయోమయంలో పడ్డారు. ఇంకొందరు.. థియేటర్ లోనే చూడలేదు.. ఇక్కడ ఏం చూస్తాం అంటుంటే.. ఇంకొందరు.. అక్కడ హిట్ అవ్వలేదు.. ఇక్కడ హిట్ అయిందేమో చూడాలి అంటున్నారు. మరి ఈ సినిమా ఓటిటీ లో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.