SS Thaman Says he is feeling pressure from pawan kalyan fans: పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో తమిళ నటుడు సముద్రఖని దర్శకత్వంలో ‘బ్రో’ సినిమా రూపొందింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మించగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. జూలై 28 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, అలాగే ప్రమోషనల్ స్టఫ్ విశేషంగా ఆకట్టుకున్న క్రమంలో సినిమా యూనిట్ సినిమా మీద చాలా నమ్మకంతో ఉంది. తాజాగా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న ఎస్.ఎస్. థమన్ విలేకర్లతో ముచ్చటించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ గార్ల కలయికలో పాట అంటే ఏదైనా ఛాలెంజింగ్ గా అనిపించిందా? అని అడిగితే ఆ పాటను మాస్ గా చేయలేమన్న థమన్ సామెతలు లాగానే చెప్పాలి కానీ ప్రత్యేక గీతాలు లాంటివి స్వరపరచలేమని అన్నారు. ఎందుకంటే ఇది అలాంటి సినిమా కాదు, కొన్ని పరిధులు ఉన్నాయి, అయితే కాలం ఎంత ముఖ్యం అనే దానిపై ఒక ప్రమోషనల్ సాంగ్ చేస్తున్నామని ఆయన అన్నారు. ఇక త్వరలో తేజ్ డ్యూయెట్ సాంగ్ ఒకటి రానుందని, అలాగే శ్లోకాలను అన్నింటినీ కలిపి ఒక పాటలా విడుదల చేయబోతున్నామని అన్నారు.
SS Thaman: రీమేక్ సినిమాలకు సంగీతం అందించడంపై థమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అంతేకాకుండా క్లైమాక్స్ లో ఒక మాంటేజ్ సాంగ్ కి సన్నాహాలు చేస్తున్నామన్న ఆయన సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉంటాయని సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఉన్నాయని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారికి మ్యూజిక్ చేయడం ప్లెజరా? ప్రెజరా? అని అడిగితే ఒక అభిమానిగా ప్లెజర్, అని అన్నారు థమన్. అలాంటి ఒత్తిడి ఉన్నప్పుడే మన అనుభవం సహాయపడుతుందన్న ఆయన సినిమాని బట్టి సంగీతం ఉంటుందని అన్నారు.. ‘భీమ్లా నాయక్’ సినిమాలో మాస్ పాటలకు ఆస్కారం ఉంది కాబట్టి, ‘లా లా భీమ్లా’ వంటి పాటలు చేయగలిగామని ఆయన అన్నారు. ఇక ఈ సినిమా విషయంలో మీరు సలహాలు ఏమైనా ఇచ్చారా? అంటే లేదండీ, ఇది మనం ఊహించే దానికంటే పెద్ద సినిమా అని ఆయన అన్నారు.. త్రివిక్రమ్ గారు స్క్రీన్ ప్లే రాసి చెప్పినప్పుడే అందరికీ రోమాలు నిక్కబొడుచుకున్నాయని, ఈ సినిమా అందరినీ కదిలిస్తుందని అన్నారు.. కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని, జీవితం అంటే ఏంటో తెలిపేలా ఉంటుందని అన్నారు. సున్నితమైన అంశాలు ఉంటాయన్న థమన్ తేజ్ కొన్ని కొన్ని సన్నివేశాలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడని, పవన్ కళ్యాణ్ గారు, తేజ్ మధ్య ఎంత మంచి అనుబంధం ఉంటుందో అది మనకు తెర మీద కనిపిస్తుందని అన్నారు.