సూపర్ స్టార్ మహేష్ బాబు .. సినిమాలు పరంగా ఎంత బిజీగా ఉన్నా ఆయన పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్. కొద్దిగా సంశయం దొరికినా కుటుంబంతో కాలక్షేపం చేస్తారు. కూతురు సితార తో ఆదుకోవడం మహేష్ కి చాలా ఇష్టం. ఇక ఈ ఇద్దరు ఇంట్లో ఉంటే అల్లరి అల్లరి. వీరిద్దరి అల్లరిపనులును నమ్రత ఎప్పటికప్పుడు క్యాప్చర్ చేసి అభిమానులకు ట్రీట్ ఇస్తూ ఉంటుంది. మరోపక్క సితార సైతం తన ఇన్స్టాగ్రామ్ లో తండ్రితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా సితార రెండు ఆడోరబుల్ ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో సితార, తండ్రితో ఫైట్ చేస్తూ కనిపించింది. ఏదో ఒక విషయంలో మహేష్ కాదనడం.. సితార పట్టుబట్టి ఆ విషయాన్ని అవును అనిపించడానికి తండ్రితో గొడవకు దిగినట్లు కనిపిస్తోంది.
ఇక ఈ ఫోటోలకు మంచి క్యాప్షన్ కూడా చెప్పుకొచ్చింది సీతూ పాప.. ‘నాన్న ప్రశాంతమైన రోజును చెడగోట్టే విషన్‌లో బిజీగా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. తండ్రి కూతుళ్లు ఎంత ముచ్చటగా ఉన్నారు అంటూ మహేష్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ఫోటోలలో కొడుకు గౌతమ్ సైలెంట్ గా బెడ్ పై కూర్చోవడం కనిపిస్తోంది. ఇటీవల ఒక షో లో మహేష్ గౌతమ్ చాలా సైలెంట్.. సితార చాలా వైలెంట్ అని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫోటోలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది కదా..