Shivaji: నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్.. బిగ్ బాస్ సీజన్ 7 కు గేమ్ ఛేంజర్ గా మారిన విషయం తెల్సిందే. చాలావరకు శివాజీనే బిగ్ బాస్ విన్నర్ గా నిలుస్తాడని అనుకున్నారు. కానీ, చివరకు పల్లవి ప్రశాంత్ ను విన్నర్ గా చేశాడు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాకా కొన్నిరోజులు రెస్ట్ తీసుకున్న శివాజీ ఈ మధ్య మీడియా ముందు గట్టిగానే కనిపిస్తున్నాడు. ఇక బిగ్ బాస్ కు వెళ్లేముందు శివాజీ #90’S అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఈటీవీ విన్ లో ఈ సిరీస్ జనవరి 5 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది.
ఇక ఈ ట్రైలర్ ఈవెంట్ లో శివాజీ.. మెగా ఫ్యామిలీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ” మెగాస్టార్ ఫ్యామిలీకి ఏపీలో కానీ, తెలంగాణలో కానీ వాళ్లకున్న ఫ్యాన్ బేస్ ఎవరికి లేదు. అసలు వాళ్లకు సీఎం అవ్వాలంటే పెద్ద కష్టమైన పని కూడా కాదు. నేను ఏది చెప్పినా క్లియర్ గా చెప్పేస్తా.. అది కొంతమందికి నచ్చొచ్చు.. నచ్చకపోవచ్చు.. ఎక్కడ లోపం జరుగుతుందో అది సరిదిద్దుకుంటే ఇంకే ఇష్యూ లేదు.. వాళ్ళ ఫ్యామిలీ నుంచి సీఎం అవ్వడం ఖాయం
” అని చెప్పుకొచ్చాడు. ఇక ఇన్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ సీఎం కావడం పెద్ద కష్టమేం కాదు అని శివాజీ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.