కమెడియన్‌గా సప్తగిరి పలికే డైలాగులు ఎంతో నవ్వు తెప్పిస్తాయి. అయితే ఇటీవల అతడు ఎక్కువ హీరోగా ఎక్కువ సినిమాల్లో కనిపిస్తున్నాడు. తాజాగా ‘8’ అనే సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దీపావళి సందర్భంగా ఈ టీజర్‌ను హీరో కళ్యాణ్ రామ్ విడుదల చేశాడు. ఈసారి వెరైటీ కాన్సెప్టును ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఈ మూవీ పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుంది. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, మలయాళం, తమిళంలోనూ ‘8’ సినిమా రిలీజ్ కానుంది.
Read Also: “లైగర్” దీపావళి స్పెషల్ గా మైక్ టైసన్ లుక్ రిలీజ్
ఇక టీజర్ విషయానికి వస్తే… ‘కనిపించేది నిజం.. వినిపించేది అబద్ధం.. అంతా భ్రమ’ అంటూ ఇంట్రో ఆకట్టుకుంటోంది. వందమందిలో ఒక్కడిగా ఏదోలా బతికేయడం కాదు. ఒక్కడిగా వందమందిలో ఎదగాలి అంటూ సప్తగిరి చెప్పే డైలాగులోనే ఈ సినిమా కథ ఉందని అర్థమవుతోంది. నొప్పి అనేది పుట్టాలి.. భయం అనేది కనిపించాలి.. అప్పుడు ఈ సంఘంలో ఎదగగలం అంటూ చెప్పే డైలాగ్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఈ మూవీలో ఒకప్పటి హీరోయిన్లు స్నేహావుల్లాల్, సోనియా అగర్వాల్ నటిస్తున్నారు. అచ్చు సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రిజ్వాన్ నిర్మిస్తున్నాడు. సూర్యాస్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.