కమెడియన్‌గా సప్తగిరి పలికే డైలాగులు ఎంతో నవ్వు తెప్పిస్తాయి. అయితే ఇటీవల అతడు ఎక్కువ హీరోగా ఎక్కువ సినిమాల్లో కనిపిస్తున్నాడు. తాజాగా ‘8’ అనే సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దీపావళి సందర్భంగా ఈ టీజర్‌ను హీరో కళ్యాణ్ రామ్ విడుదల చేశాడు. ఈసారి వెరైటీ కాన్సెప్టును ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఈ మూవీ పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుంది. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, మలయాళం, తమిళంలోనూ ‘8’ సినిమా రిలీజ్ కానుంది.…