టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నాగచైతన్యతో విడాకుల తరువాత జోరు పెంచిన ఈ భామ భాషతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని చేతినిండా సంపాదిస్తుంది. ఇక ప్రస్తుతం హైదరాబాద్ లో తాను, చైతన్య ఎంతో ఇష్టంగా కట్టించుకునేం ఇంట్లోనే ఉంటున్న సామ్.. మరో ఇంటిది కాబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఎక్కువగా సామ్ బాలీవుడ్ సినిమాలను ఓకే చేస్తున్న సంగతి విదితమే.. ఇక అందుకోసం ప్రతిసారి ముంబై, హైదరాబాద్ అంటూ తిరగాల్సి వస్తుందట. అందుకే అమ్మడు తన మకాంను బాలీవుడ్ కే షిఫ్ట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ముంబై సముద్ర తీరాన సామ్ ఒక అందమైన ఇంటిని కొనుగోలు చేసి, తన అభిరుచికి తగ్గట్టు మల్చుకుంటుందట. ఇక ఇందులో మరో విశేషమేంటంటే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఉండే ఏరియాలో అదీ కాకుండా ఆ హీరోయిన్ ఉండే ఇంటికి కాస్త దూరంలోనే సమంత కొత్తగా తీసుకున్న ఇల్లు ఉంటుందని అంటున్నారు. అయితే ఆ హీరోయిన్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది. మరి ఇదే కనుక నిజమైతే సామ్ బాలీవుడ్ కె అంకితమవుతుందా..? లేక టాలీవుడ్, బాలీవుడ్ అంటూ అటు ఇటు తిరుగుతుందో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం తెలుగులో సమంత.. యశోద, శాకుంతలం సినిమాల్లో నటిస్తోంది.