నితిన్ రాబిన్ హీరోగా నటించితిన లేటెస్ట్ సినిమా రాబిన్ హుడ్. వరుస ప్లాప్స్ తో ఇబ్బందిపడుతున్న ఈ యంగ్ హీరో గతంలో తనకు భీష్మ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములను నమ్ముకున్నాడు. నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది తమిళ సంగీత దర్శకుడు GV ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించింది. అనేక సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో విడుదలయింది. ఓవర్సీస్ ప్రీమియర్స్ నుండి వస్తున్న టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం రండి.
రాబిన్ హుడ్ ఫస్ట్ హాఫ్ కొంత వరకు ఒకే. కొత్తదనం ఏమీ లేకుండా రొటీన్ కమర్షియల్ టెంప్లేట్‌ను ఫాలో అవుతూ కథ నడిపాడు. కామెడీ కొన్ని చోట్ల క్లిక్ బాగా వర్కౌట్ అయింది. కానీ సినిమా ఫ్లో కాస్త గందరగోళంగాఉందని అలాగే ఇంటర్వెల్ ఫైట్ స్టైలిష్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఇక సెకండ్ హాఫ్ ఆకట్టుకుంది. శ్రీలీల రోల్ కాస్త ఇరిటేట్ చేసింది. ఇక వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ ఎప్పటిలాగే తమదైన శైలిలో నవ్వించారు. కథలో మరికాస్త పదును పెట్టి ఉంటే బాగుండేది. ఎంతో హైప్ ఇచ్చిన డేవిడ్ వార్నర్ చివరి ఐదు నిముషాలు మాత్రమే కనిపించి సెకండ్ పార్ట్ కు లీడ్ ఇచ్చాడు. సంగీతం ఈ సినిమాకు బాగా మైనస్ ఒక్క పాట కూడా గుర్తుండవు. మొత్తానికి రాబిన్ ఓకేయిష్ సినిమాగా నిలుస్తుందని ఓవర్సీస్ నుండి వస్తున్న టాక్.