‘టచ్ చేసి చూడు, నేల టిక్కెట్, అమర్ అక్బర్ ఆంటోని, డిస్కోరాజా’ వంటి వరుస ప్లాప్స్ తర్వాత ‘క్రాక్’తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన రవితేజ మళ్ళీ ‘ఖిలాడి’తో డౌన్ అయ్యాడు. ప్రస్తుతం ‘రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, ధమాక, టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు రన్నింగ్ లో ఉన్నాయి. ఇవి కాకుండా చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’లో స్పెషల్ రోల్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే దాదాపు పూర్తయిన ‘రామారావు ఆన్ డ్యూటి’ సినిమాను రవితేజ పక్కన పెట్టేశాడనే వార్తలు వినవస్తున్నాయి.…