Rashmika Mandanna Reacts On Her Role In Varisu Film: ఏ హీరోయిన్‌ని అడిగినా సరే.. ఫలానా సినిమాని ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నిస్తే, తమకు అందులో పాత్ర నచ్చిందని చెప్తుంటారు. ఆ సినిమా రిజల్ట్ ఎలా వచ్చినా సరే.. తమకు అందులోని క్యారెక్టరైజేషన్ నచ్చడం వల్లే ఆ సినిమా చేశామంటూ చెప్పుకుంటూ వస్తారు. కానీ.. రష్మిక మందన్న మాత్రం అందరిలా రొటీన్ జవాబు ఇవ్వలేదు. నిజాయితీగా మాట్లాడింది. తాను వారిసు సినిమా ఒప్పుకోవడానికి కారణం విజయ్ మాత్రమేనని, ఆయనతో కలిసి వెండితెర పంచుకోవాలన్న కోరిక మేరకు ఈ సినిమా చేశానని పేర్కొంది. తనకు ఇందులో ఎలాంటి స్కోప్ లేదని తెలిసినా.. విజయ్ కోసం మాత్రమే సినిమా చేశానంటూ కుండబద్దలు కొట్టింది.
Hibiscus Tea: మందారం టీతో లాభాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు
రష్మిక మాట్లాడుతూ.. ‘‘స్టోరీ విన్నప్పుడే, వారిసులో నా పాత్రకు ఎలాంటి స్కోప్ లేదని తెలిసిపోయింది. అయినా సరే అందులో నటించాను. అది నా సొంత నిర్ణయం. నా ఇష్ట ప్రకారమే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నా. అందుకు కారణం.. విజయ్. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి వెండితెర పంచుకోవాలన్నది నా డ్రీమ్. ఆ కలను వారిసుతో సాకారం చేసుకునే అవకాశం రావడంతో, ఆ సినిమాలో నటించాను. ఇందులో నా పాత్ర కేవలం రెండు పాటలకే పరిమితమనే విషయం నాకు బాగా తెలుసు. ఈ విషయాన్ని షూట్ సమయంలో విజయ్‌కి సరదాగా చెప్పేదాన్ని. ఈ సినిమాలో నాకు రెండు పాటలు తప్ప.. అంతకుమించి ఇంకేమీ లేదని జోక్స్ వేసేదాన్ని’’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే షూటింగ్ టైంలో తాను విజయ్ నుంచి కొన్ని విషయాలు కూడా నేర్చుకున్నానని రష్మిక పేర్కొంది.
Thunivu: ఆత్మహత్య చేసుకున్న అజిత్ ఫ్యాన్.. అందుకు అనుమతి ఇవ్వలేదని..
బాలీవుడ్‌లో తాను నటించిన ‘మిషన్ మజ్ను’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తానిచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. రష్మిక పై విధంగా వారిసుపై స్పందించింది. ఈ సినిమాలో జిమిక్కి పొన్ను, రంజితమే పాటల్లో రష్మిక అందంగా కనిపించడంతో పాటు తన డ్యాన్స్‌తోనూ అదరగొట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడు రణ్‌బీర్ కపూర్ సరసన ‘యానిమల్’ సినిమా చేస్తోంది. ఇటు తెలుగులో అల్లు అర్జున్ సరసన పుష్ప-2లోనూ కనిపించనుంది.