Ajith Fan Veerabagu Commits Suicide For Not Allowing Him In Theatre: హీరోలపై అభిమానం ఉండటంలో తప్పు లేదు కానీ, అది హద్దు మీరితేనే లేనిపోని సమస్యలు ఎదురవుతాయి. కొన్నిసార్లు ఆ అభిమానం ప్రాణాలమీదకు కూడా తీసుకొస్తుంది. బ్యానర్లు కడుతున్నప్పుడు కింద జారిపడో, ఎలక్ట్రిక్ షాక్ తగిలో అభిమానులు చనిపోయినట్టు మనం ఇదివరకే కొన్ని సంఘటనల గురించి విన్నాం. అజిత్ సినిమా తునివు రిలీజైన రోజు అభిమానులు జరుపుకున్న సంబరాల్లోనూ ఒక అభిమాని మృతి చెందాడు. ఇప్పుడు మరో ఫ్యాన్ ఒక విషయంలో నొచ్చుకొని, ఆత్మహత్యకు పాల్పడడం సంచలనంగా మారింది.
Sunil: సునీల్‌కి మరో బంపరాఫర్.. ఆ తమిళ సినిమాలో కీ-రోల్
ఆ వివరాల్లోకి వెళ్తే.. తూత్తుక్కుడికి చెందిన వీరబాగు అనే వ్యక్తి తమిళ హీరో అజిత్‌కి వీరాభిమాని. అజిత్ అంటే అతనికి ఎంత అభిమానం అంటే.. రిలీజ్ రోజే ఆయన సినిమాల్ని మిస్ అవ్వకుండా చూస్తాడు. ఈసారి తునివు సినిమాని చూసేందుకు తన కుటుంబసభ్యులతో కలిసి థియేటర్‌కి వెళ్లాడు. అయితే.. అతడు మద్యం తాగి ఉండటంతో, థియేటర్ సిబ్బంది అతడ్ని లోనికి అనుమతించలేదు. మద్యం తాగిన వాళ్లను లోనికి పంపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అప్పుడు చిన్నపాటి వాగ్వాదం జరగ్గా.. థియేటర్ మేనేజర్ రంగంలోకి దిగాడు. వీరబాగుని కించపరిచేలా మాట్లాడాడు. కేవలం అతని కుటుంబసభ్యుల్ని మాత్రమే థియేటర్‌లోకి అనుమతించారు.
SKN Trolled Dil Raju: దిల్‌రాజుని వేదికపై ట్రోల్ చేసిన ఎస్కేఎన్.. భలే ఇరుక్కు
ఈ పరిణామంతో వీరబాగు ఖంగుతిన్నాడు. తనకు సినిమా చూడ్డానికి అనుమతించకపోవడం, కుటుంబ సభ్యుల ముందే ఘోరంగా అవమానించడంతో.. తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. దీంతో.. అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్లి, ఆత్మహత్య చేసుకున్నాడు. సినిమా అయిపోయాక ఇంటికి వెళ్లిన కుటుంబసభ్యులు.. వీరబాగుని విగతజీవిగా చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.
Neeta Pawar Missing: కన్నడ నటుడి సోదరి మిస్సింగ్.. మూడు రోజులైనా..