Ram Pothineni Speech at Skanda Pre Release Event : స్కంద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ స్పీచ్ మొదలు పెడుతూ ఉండగా సుమ ఒక ప్రశ్న అడుగుతానని చెప్పి సాయి మంజ్రేకర్, శ్రీ లీల ఇద్దరిలో ఎవరి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుందని ప్రశ్నించింది. దానికి రామ్ తెలివిగా బాలకృష్ణ గారిని ముందు పెట్టుకుని ఈ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మాట్లాడుకోవడం అవసరమా అంటే బాలకృష్ణ సీరియస్ గా దగ్గరికి వెళ్లి సాయి మంజ్రేకర్ ను చూపిస్తూ ఆవిడ గురించి మాట్లాడు నన్ను ఎందుకు లాగుతావు మధ్యలోకి అంటూ చెప్పడంతో రామ్ సైలెంట్ అయ్యి అక్కడి నుంచి స్పీచ్ మొదలుపెట్టాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఇంత గ్రాండ్ గా మెమొరబుల్ గా చేసినందుకు బాలకృష్ణ గారికి స్పెషల్ థాంక్స్ చెప్పిన రామ్ సారీ బాబాయ్ అనడంతో నందమూరి బాలకృష్ణ బతికిపోయావని చమత్కరించారు. అవును బతికి పోయాను అంటూ రామ్ మొదలుపెట్టి జై బాలయ్య అంటూ అభిమానులు నినాదాలు చేస్తుండడంతో చెప్తా చెప్తా స్పీచ్ చివర్లో చెబుతానంటూ పేర్కొన్నారు. స్కంద యూనిట్ చూశారా ఎంతమంది ఉన్నారు ఆర్టిస్టులే ఇంతమంది ఉన్నారంటే ఇంకా టెక్నీషియన్లు ఇంకా ఎంతమంది ఉండి ఉంటారో ఊహించుకోండి, ఇక్కడ పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక్కడ ఎక్కువ సమయం లేదు కాబట్టి పేరుపేరునా థాంక్స్ చెప్పలేకపోతున్నానని పేర్కొన్నారు. తమన్ తన సోదరుడు లాంటివాడని సినిమాకి కిక్ యాస్ బీజీఎం ఇచ్చాడు అని చెప్పుకొచ్చారు.
ఈ సినిమా గురించి ముందుగా చేసిన ఒక సాంగ్ తనకు వినిపించారని ఆ సాంగ్ వింటేనే సినిమా ఎలా ఉండబోతుందో తనకు అర్థమైందని రామ్ చెప్పుకొచ్చారు. ఇంకా ఆ సాంగ్ రిలీజ్ అవ్వలేదని ఈ నెలాఖరులోపు సాంగ్ రిలీజ్ చేస్తారని అది రిలీజ్ అయిన తర్వాత సినిమా మీద అంచనాలు ఒక్కసారిగా పెరుగుతాయని, అప్పుడు తెలుస్తుందని రామ్ అన్నారు. నిర్మాతలు శ్రీనివాస చిట్టూరి, పవన్ గురించి మాట్లాడుతూ వాళ్ళిద్దరూ లేకపోతే ఈ సినిమా లేదని సుమారు ఐదేళ్ల క్రితమే ఈ కాంబినేషన్ సినిమా చేయాలని అన్నారని చెప్పుకొచ్చారు. సాయి మంజ్రేకర్ గురించి మాట్లాడుతూ చూడడానికి అయోమయంగా కనిపిస్తుంది కానీ తెలుగులో రాప్ కూడా చేసేస్తుందని అన్నారు. శ్రీలీల గురించి మాట్లాడుతూ సినిమాలకి డేట్స్ ఇస్తే హీరోయిన్ అంటారు, అదే ఒక్క డేట్ సినిమాలకి ఇస్తే అది శ్రీ లీల అంటారు. ఈ డేట్ మీకు ఇస్తున్న తీసుకోండి అని ఒక మూడు సినిమాలకి అంటుందని రామ్ చమత్కరించాడు.
ఇక బోయపాటి అనగానే మొండితనం గుర్తొస్తుందని ఏదైనా నమ్మితే మొండిగా ముందుకు వెళ్లిపోవడమే ఆయనకు తెలుసు అని అన్నారు. ఇక బాలకృష్ణ గురించి మాట్లాడుతూ ఫంక్షన్ కి పిలిచిన తర్వాత పద్ధతిగా ఉంటుంది నేను నేరుగా వచ్చి కలిసి మాట్లాడతానంటే పద్ధతి మనకు అది లేదుగా అని అన్నారని రామ్ చెప్పుకొచ్చారు. ఇక తాను మాట్లాడుతున్నప్పుడు బాలకృష్ణకు వినపడలేదేమో అని అంటే వినపడాల్సినవి వినపడతాయని వినకూడదు అనుకున్నది కూడా ఒకోసారి వినపడతాయని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా హిందీలో పలు మాటలు మాట్లాడిన బాలకృష్ణ లాగి కొడితే ఏమవుతుందో తెలుసా అంటూ రామ్ తో పరాచకాలు ఆడారు. అయితే రామ్ మాట్లాడుతూ బాలకృష్ణ స్థాయి వేరని ఆయన ఇప్పటికీ మూడు తరాల ప్రేక్షకులను అలరిస్తున్నారంటే అది మామూలు విషయం కాదని అన్నారు ఒక నటుడికి అవార్డులు రివార్డులు కాదు ఇలాంటి విషయాలు స్ఫూర్తినిస్తాయని చెప్పుకొచ్చారు.