Ram Charan: “తెలుగు సినిమాకి గుర్తింపును .. గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావుగారు. అలాంటి వ్యక్తి పనిచేసిన ఇండస్ట్రీలో మనం పనిచేస్తుండటం కంటే గర్వకారణం మరొకటి లేదు” అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. నేడు హైదరాబాద్ లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు గ్రాండ్ గా నిర్వహించారు. సినీ, రాజకీయ ప్రముఖులు.. ఈ వేడుకలో పాల్గొని ఎన్టీఆర్ గురించి, ఆయనతో తమకి గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించారు. ఇక ఈ వేడుకకు మెగా కుటుంబం నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిధిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. చిన్నతనంలో ఎన్టీఆర్ తో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. అంతేకాకుండా ఎన్టీఆర్ ను తలుచుకొని క్షణం ఉండదని, రోజు సెట్ కు వెళ్లే ప్రతి ఆర్టిస్ట్ ఆయన గురించి మాట్లాడుకుంటారని తెలిపాడు. ఆయన గురించి ఇంతమంది ముందు మాట్లాడే అవకాశం రావడం తన అదృష్టమని చెప్పుకొచ్చాడు.
Venkatesh: ఎన్టీఆర్ తో సినిమా చేయలేదు అన్న బాధ.. అందుకే ఆ పని చేశా
“తెలుగు ప్రజలకు రాముడన్నా .. కృష్ణుడన్నా రామారావుగారే. వారు సాధించిన విజయాలను గురించి మాట్లాడడం కన్నా ఎక్కువగా మన మనస్సులో ఆలోచన చేస్తూ, వారు వేసిన దారుల్లో నడుస్తూ వారిని గుర్తుచేసుకున్నప్పుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ప్రతిరోజు సినిమాకు సెట్ కు వెళ్లిన ఒక ఆర్టిస్ట్ నాతో సహా.. ఈ పేరును గుర్తుతెచ్చుకోకుండా ఉండడు. తెలుగు సినిమాకి గుర్తింపును.. గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావుగారు. అలాంటి వ్యక్తి పనిచేసిన ఇండస్ట్రీలో మనం పనిచేస్తుండటం కంటే గర్వకారణం మరొకటి లేదు. ఇక ఎక్కువసార్లు కలవకపోయిన ఆయనను ఒక్కసారి కలిసే అవకాశం వచ్చింది. నేను ఐదో, ఆరో తరగతి చదువే సమయంలో.. పురంధరేశ్వరిగారి అబ్బాయితో స్కెటింగ్ క్లాసెస్ చేసేవాళ్ళం. ఆ కాల్స్ అయిన తరువాత అతను.. మా తాత ఇంటికి వెళ్దాం అని అన్నాడు. అప్పుడు ఆయన సీఎం గా ఉన్నారు.
NTR: నా బాధల్లో.. సంతోషాల్లో తోడున్నది మీరే.. గుండెలను పిండేస్తున్న ఎన్టీఆర్ లేఖ
ఇక ఉదయం 6 గంటలకే.. మీరందరు విన్నట్టే.. మూడున్నరకు లేచి.. వర్క్ అవుట్స్ చేసి, స్నానం చేసి.. బ్రేక్ ఫాస్ట్ కు కూర్చున్నారు. మొదటిసారి ఆయనను అప్పుడే కలిసాను. బ్రేక్ ఫాస్ట్ లోనే పెద్ద బకెట్ లో చికెన్ పెట్టుకొని, ఆ వయస్సులో కూడా హెల్తీగా తింటున్నారు. నన్ను కూడా కూర్చోపెట్టి నాకు కూడా బ్రేక్ ఫాస్ట్ పెట్టారు. ఇక ఇప్పుడు సౌత్ ఇండియా గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. కానీ, ఆ కాలంలోనే ఎన్టీఆర్ గారు.. మన పవర్ ఏంటో చూపించారు. ఇక అలాంటి వ్యక్తి గురించి నెక్స్ట్ జనరేషన్ కూడా తెలుసుకోవాలి. ఇలాంటి ఫంక్షన్ కు నన్ను పిలిచినందుకు నందమూరి కుటుంబానికి థాంక్స్. ఇక బాలయ్య బాబు గారు మా ఫంక్షన్స్ కు అన్నింటికి వస్తారు.. ఇక ఈ ఫంక్షన్ కు పిలిచిన బాలయ్య బాబు గారికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్తున్నాను” అంటూ ముగించాడు.