Allu Arjun: సాధారణంగా ఒకే కుటుంబం నుంచి వచ్చిన సినీ సెలబ్రిటీల మధ్య ఐక్యత లేకపోతే ట్రోలర్స్ నుంచి వచ్చే ట్రోల్స్ ను తట్టుకోవడం కష్టం. అన్నదమ్ముళ్లు కానీ, తండ్రి కొడుకులు, బావ బామ్మర్దులు.. మామఅల్లుళ్ళు.. ఇలా ఎవరైనా సరే.. ఒకరి సినిమాకు మరొకరు సపోర్ట్ గా నిలిస్తేనే వారు కలిస్ ఉన్నట్లు.. లేదా కొంచెం అనుమానం వచ్చినా సోషల్ మీడియా వారిని ఏకిపారేస్తుంది. ఇక అందుకు ఉదాహరణ. మెగా- అల్లు ఫ్యామిలీస్. అల్లు రామలింగయ్య కొడుకు అల్లు అరవింద్, అల్లుడు చిరంజీవి. అలా ఈ రెండు కుటుంబాలు కలిసే ఇండస్ట్రీని ఏలుతున్నాయి. మొదటి జనరేషన్ మారింది.. రెండో జనరేషన్ వచ్చింది.. ఇప్పుడు రామ్ చరణ్ -అల్లు అర్జున్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే ఎప్పటినుంచో వీరిద్దరి మధ్య విబేధాలు ఉన్నాయని సోషల్ మీడియా కోడై కూస్తోంది. దీంతో వారు పెట్టిన పోస్ట్ నుంచి .. ఫోటో వరకు ప్రతి ఒక్కదానిమీద నెటిజన్స్ ఫోకస్ చేయడం.. కొద్దిగా తేడాగా అనిపించినా వారిద్దరి మధ్య గొడవలు అని చెప్పడం చాలారోజులుగా జరుగుతుందే.
Actor Suman: ఇండో-బ్రిటీష్ పెయిన్ క్లినిక్ లోగోను ఆవిష్కరించిన సినీ నటుడు సుమన్
ఇక తాజాగా అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు వచ్చిన విషయం తెల్సిందే . ఈ విషయం తెలియడంతో ఇండస్ట్రీ మొత్తం బన్నీకి విషెస్ తెలుపుతుంది. బన్నీ సైతం.. తనకు విష్ చేసిన వారందరికీ ఎంతో ఓపిగ్గా వారు ఎలా అయితే పెట్టారో.. అలానే రిప్లై ఇచ్చాడు. అయితే .. రామ్ చరణ్ కు మాత్రం కేవలం థాంక్స్ అని రిప్లై ఇవ్వడంతో.. అందరికీ మైడియర్ బ్రదర్.. కజిన్ .. లవ్స్.. అని పెట్టి.. చరణ్ కు మాత్రం ఉత్తిగా థాంక్స్ చెప్పడం ఏంటీ.. వీరి మధ్య ఏమైనా గొడవలు జరిగాయా అని రెండు రోజులుగా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆ పుకార్లకు చెక్ పెట్టాడు బన్నీ. ఉపాసన- చరణ్.. బన్నీకి అవార్డు వచ్చిన వెంటనే .. బొకేతో పాటు కంగ్రాట్స్ నోట్ ను కూడా పంపారట. ఆ పుష్పగుచ్ఛానికి సంబంధించిన ఫోటోను బన్నీ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి చరణ్ – ఉపాసనకు థాంక్స్ చెప్పాడు. ఈ ఒక్క పోస్ట్ తో వారి మధ్య ఎలాంటి కోల్డ్ వార్ లేనట్లే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.