స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ‘వారిసు’ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాను అని చెప్పగానే, డబ్బింగ్ సినిమాలకి థియేటర్స్ తక్కువ ఇచ్చి మన సినిమాలకి ఎక్కువ థియేటర్స్ ఇవ్వాలనే గొడవ మొదలయ్యింది. ఈ గొడవని పట్టించుకోకుండా ‘వారిసు/వారసుడు’ ప్రమోషన్స్ ని చేసుకుంటూ వెళ్తున్న దిల్ రాజు. ఎవరు ఏమనుకున్నా సరే ‘వారిసు’ సినిమాని సంక్రాంతికే రిలీజ్ చేస్తానన్న దిల్ రాజు, అనుకున్నంత పనీ చేశాడు. ‘వారిసు’ సినిమాని జనవరి 12న ప్రేక్షకుల ముందుకి తెస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని థియేటర్స్ ఏ సినిమాకి దొరుకుతాయి అనే చర్చ జరుగుతుంటే, మంచి థియేటర్స్ మాత్రం నా సినిమాకే వస్తాయని చెప్పిన దిల్ రాజు ‘వారిసు’ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడం కొంతమందికి షాక్ ఇచ్చి ఉంటుంది.
‘వారిసు’కి పోటీగా విడుదల కానున్న ‘వాల్తేర్ వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాల రిలీజ్ డేట్స్ ఇంకా అనౌన్స్ అవ్వలేదు. తెలుగు సినిమాలు విడుదల తేదీ ప్రకటించే లోపు, తన సినిమా డేట్ ని ప్రకటించడం ‘వారిసు’కి కలిసొచ్చే విషయమే. ఒక సినిమా ఓపెనింగ్స్ బాగుండాలి అంటే ముందుగా ఆ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయాలి. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ ఈవెంట్స్ ని ప్లాన్ చేసుకోని, రిలీజ్ డేట్ ని ప్రేక్షకుల్లోకి తీసుకోని వెళ్లాలి. ఆ రోజు ఆ సినిమా వస్తుంది, అది చూడడానికి థియేటర్స్ కి వెళ్లాలి అనే ఫీలింగ్ ఆడియన్స్ లో కలిగించాలి. అప్పుడే ఏ సినిమాకైనా సాలిడ్ ఓపెనింగ్స్ వస్తాయి. ఈ విషయం స్పష్టంగా తెలిసిన వాడు కాబట్టే దిల్ రాజు, అందరికన్నా ముందు ‘వారిసు’ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశాడు.
ఇక్కడి నుంచి దిల్ రాజు ‘వారిసు’ కోసం ప్రధాన థియేటర్స్ ని బ్లాక్ చేయడం మొదలుపెడతాడు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నాడు కాబట్టి దిల్ రాజుకి ఇతర డిస్ట్రిబ్యూటర్ లతో మంచి సంబంధాలు ఉంటాయి. ఈ కారణంగా ‘వారిసు’కి తెలుగు రాష్ట్రాల్లో మంచి థియేటర్స్ దొరుకుతాయి. మరి దిల్ రాజు లాగా మైత్రి మూవీ మేకర్స్ కూడా ‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ల రిలీజ్ డేట్ ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి.