Priyanka Chopra : ప్రియాంక చోప్రా వారణాసి కోసం తెలుగు నేర్చుకుంటోంది. ఆమెనే స్వయంగా డబ్బింగ్ చెప్పబోతోంది. దీని కోసం ఆమె స్వయంగా తెలుగు నేర్చుకుంటోంది. రీసెంట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈవెంట్ లో మాట్లాడేందుకు ఆమె తెలుగు ప్రాక్టీస్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మిగతా హీరోయిన్లు తెలుగులో మాట్లాడటానికి చాలా నామూషీగా ఫీల్ అవుతున్నారు. స్టైల్ గా ఇంగ్లిష్ లోనే మాట్లాడుతున్నారు. దీంతో ప్రియాంక చోప్రా డెడికేషన్ కు అంతా హ్యాట్సాఫ్ అంటున్నారు. వాస్తవానికి ప్రియాంక చోప్రా గ్లోబల్ బ్యూటీ. హాలీవుడ్ లో సత్తా చాటిన ఇండియన గర్ల్ ఆమె.
Read Also : I Bomma Ravi : సజ్జనార్ కు రవి తండ్రి రిక్వెస్ట్… మనవరాలి కోసం..\
అంత స్టార్ డమ్ ఉండి కూడా తెలుగులో మాట్లాడటానికి ఆమె ట్రై చేస్తోంది. ప్రాక్టీస్ చేస్తోంది. కానీ తమిళం, మలయాళం, ముంబై నుంచి వస్తున్న హీరోయిన్లు మాత్రం తెలుగులో మాట్లాడటానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఏదో వాళ్లకే వచ్చినట్టు ఇంగ్లిష్ లో మాట్లాడుతూ బిల్డప్ కొడుతుంటారు. ఇది మనం ఎన్నోసార్లు చూశాం కదా. అంత పెద్ద స్టార్ అయిన ప్రియాంక చోప్రానే తెలుగులో మాట్లాడుతుంటే.. వీళ్లకేం అయిందని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ప్రియాంకను చూసి అయినా మైండ్ మార్చుకోవాలని సూచిస్తున్నారు.
Read Also : Premante Movie : ఆసక్తికరంగా ప్రియదర్శి ప్రేమంటే ట్రైలర్..