I Bomma Ravi : ఐ బొమ్మ రవి అరెస్ట్ ఒక సంచలనంగా మారింది. ఆయన కేసులో ఎన్నో విషయాలు బయట పడుతున్నాయి. అయితే రవి తండ్రి మాత్రం తన కొడుకు చేసింది తప్పే అంటున్నారు. అతన్ని చట్ట పరంగానే శిక్షించాలని కోరుతున్నాడు. ఈ క్రమంలోనే తన మనవరాలి గురించి రవి తండ్రి చేసిన రిక్వెస్ట్ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా రవి తండ్రి అప్పారావు సీపీ సజ్జనార్ కు ఒక రిక్వెస్ట్ చేశారు. నా కొడుకు చేసింది తప్పే కావచ్చు. కానీ వాడికి ఒక కూతురు ఉంది. మా మీద దయతలిచి వాడిని స్టేషన్ లో ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దని కోరుకుంటున్నాను. వాడికి ఒక కూతురు ఉంది. ఇప్పుడు నా బాధ అంతా మనవరాలి కోసమే.
Read Also : Meera Vasudevan : ముచ్చటగా మూడోసారి విడాకులు తీసుకున్న నటి
నా మనవరాలి కోసమైన రవికి తక్కువ శిక్ష పడేలా చూడండి. ప్రజెంట్ నా కోడలు కూడా నాతో మాట్లాడదు. నా మనవరాలిని తలచుకుంటేనే నాకు చాలా బాధగా అనిపిస్తోంది. నా కొడుకు తప్పు చేశాడు. నా మనవరాలు చాలా తెలివైనది. ఇప్పుడు నా బాధ అంతా దాని గురించే. అలా అని నా మనవరాలి కోసం కొడుకును వదిలిపెట్టరని నాకు తెలుసు. ఎందుకంటే చట్టానికి జాలి దయ అనేవి ఉండవు. తప్పు చేసిన వారంతా ఒక్కటే. ఇప్పుడు నేను బాధపడటం తప్ప నాకు మరో అవకాశం లేదు అని తెలిపారు అప్పారావు.
Read Also : Balakrishna – Gopichand : బాలయ్య-గోపీచంద్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్