Premi Viswanath: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రస్తుతం ఇదే పద్దతిని హీరోయిన్లు చక్కగా పాటిస్తున్నారు. ఏజ్, అవకాశాలు ఉన్నప్పుడే ఒక రూపాయిని వెనుకేసుకుంటున్నారు. ఇంకొంతమంది ఆ రూపాయిని ప్రొడక్షన్ రంగంలో పెట్టి పది రూపాయలు సంపాదిస్తున్నారు. అదేనండి నిర్మాతులుగా మారి రెండు చేతుల సంపాదిస్తున్నారు. అయితే ఇందులో కొంతమంది సక్సెస్ అవుతున్నారు.. ఇంకొంతమంది ఫెయిల్ అవుతున్నారు. ఇక తాజాగా బుల్లితెర నటి ప్రేమి విశ్వనాధ్ కూడా ఇదే ఫార్ములాను పాటిస్తోందని వార్తలు గుప్పుమంటున్నాయి. కార్తీక దీపం సీరియల్ తో బుల్లితెరఫైఅడుగుపెట్టింది ప్రేమి. ఈ సీరియల్ తో ఆమె వంటలక్క గా మారిపోయింది. ఎంత ఫేమస్ అయ్యింది అంటే.. ఆమె కోసం మగవాళ్ళు కూడా సీరియల్ చూసేంత. ఇక దీంతో ఆమె పాపులారిటీ పెరిగిపోయింది.
Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ సిద్ధంకండమ్మా.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ వచ్చేస్తున్నాడు
సీరియల్ ఇండస్ట్రీలోనే టాప్ రెమ్యూనిరేషన్ తీసుకున్న ఏకైక నటి ప్రేమి విశ్వనాధ్. ఇక ఈ సీరియల్ ఇటీవలే ముగిసిన విషయం తెల్సిందే. సీరియల్ చేస్తూ ప్రేమి గట్టిగానే వెనుక వేసిందంట. ఆ డబ్బుతో ప్రేమి ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ ను మొదలుపెట్టి ఒక సీరియల్ ను ప్రొడ్యూస్ చేయాలనీ చూస్తోందట. మంచి కథను వెతికి.. కొత్తవారితో ఆ సీరియల్ ను తీసే పనిలో పడిందట. అయితే ఇది మంచి పనే అని కొందరు చెప్తుండగా.. వంటలక్క మనకు అవసరం ఈ నిర్మాత అవతారం.. చక్కగా నటనలోనే ఒక రూపాయి సంపాదించుకొని డబ్బు దాచుకోకా అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఈ వేతలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.