ముందు నుంచి ప్రశాంత్ నీల్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అనుకున్నట్టే సలార్‌తో ప్రభాస్‌కు మ్యాసివ్ హిట్ ఇచ్చాడు. ఇక సలార్‌తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయిన ప్రభాస్… నెక్స్ట్ కల్కి 2898 ఏడితో రాబోతున్నాడు. మే 9న కల్కి భారీ ఎత్తున రిలీజ్ కానుంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత రాజా సాబ్‌గా రాబోతున్నాడు డార్లింగ్. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టైటిల్‌ను ఇటీవలె సంక్రాంతికి అనౌన్స్ చేశారు. ఇప్పటికే సైలెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న రాజా సాబ్‌ను ఈ ఏడాదిలోనే రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. కల్కి రిలీజ్ అయిన తర్వాత రాజా సాబ్ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
Read Also: Tripti Dimri : ఆ ఒక్కటి ఉంటే చాలు.. వాడినే పెళ్లి చేసుకుంటాను..
ఇటీవల మారుతి మాట్లాడుతూ… ప్రభాస్ నుంచి ముందుగా ఓ పెద్ద సినిమా రానుంది, కాబట్టి దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలని అన్నారు. ఆ మూవీ తర్వాత రాజా సాబ్ అప్డేట్లు వస్తాయని చెప్పారు. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ఇయర్ ఎండింగ్‌లో రాజా సాబ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. లేటెస్ట్‌గా చెన్నైలో రాజా సాబ్ మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. తమన్, ప్రభాస్ కాంబోలో వస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే. దీంతో ప్రభాస్ కోసం తమన్ అదిరిపోయే మ్యూజిక్ ఆల్బమ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. మరి రాజా సాబ్ ఎలా ఉంటుందో చూడాలి.