బాలీవుడ్ లో ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా యానిమల్.. ఈ సినిమాతో హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి.. సినిమా వచ్చి చాలా రోజులు అవుతున్నా కూడా ఈ అమ్మడు పై గాసిప్స్, ట్రోల్స్ ఆగడం లేదు.. దాంతో పాప ట్రెండింగ్ లో ఉంది.. సోషల్ మీడియాలో యమ క్రేజ్ ను సంపాదించుకుంది.. విపరీతమైన ఫాలోయర్స్ పెరిగిపోయారు.. ఇక ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసింది.. దాంతో అమ్మడు మరోసారి నెట్టింట ట్రెండ్ అవుతుంది.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రి కీలకపాత్ర పోషించింది. జోయా అనే పాత్రలో స్క్రీన్‌పై కనిపించింది కొద్ది సమయమే అయినప్పటికీ ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా రణ్‌బీర్ – త్రిప్తి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో హైలెట్ అయ్యాయి.. యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.. ఇకపోతే త్రిప్తి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు గత కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి..
తాజాగా ఈ రూమర్స్ పై స్పందించిన త్రిప్తి క్లారిటీ ఇచ్చింది.. సోషల్ మీడియాలో వస్తున్న పెళ్లి వార్తలపై ఆమెను ఇంటర్వ్యూలో ప్రశ్నించగా, ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలేమి లేదని, ఇప్పటికైతే తన కెరీర్ పైనే ఫోకస్ పెట్టానంటూ తృప్తి క్లారిటీ ఇచ్చింది. కానీ తనకు కాబోయే భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పింది. అతనికి డబ్బు, పాపులారిటీ వంటివి లేకున్నా ఫర్వాలేదు కానీ మంచి మనసున్న వ్యక్తి అయితే చాలు అతన్నే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది.. యానిమల్’ కంటే ముందే త్రిప్తి డిమ్రి పలు ఓటీటీలలో నటించింది. ప్రస్తుతం సినిమా ఛాన్సులు వస్తున్నా కూడా ఓటీటీని మాత్రం నిర్లక్ష్యం చేయనని తెలిపింది. త్రిప్తి డిమ్రికి తెలుగులోనూ వరుస అవకాశాలు వస్తున్నట్లు సమాచారం.. విజయ్ దేవరకొండ, రవి తేజ సినిమాల్లో నటించబోతుంది..