పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘OG’ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్ తో సినిమా చేస్తుండడం ఇదే మొదటిసారి కావడంతో ఫాన్స్ మరోసారి ఫుల్ లోడెడ్ ఫ్యాన్ స్టఫ్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ అంచనాలని మీట్ అవుతూ డైరెక్టర్ సుజిత్ ఒకపక్క జెట్ స్పీడ్ లో షూటింగ్ చేస్తూనే మరోవైపు సాలిడ్ ప్రమోషన్స్ ని కూడా చేస్తూనే ఉన్నాడు. పంజా సినిమా వైబ్స్ ని ఇస్తున్న OG సినిమా ఇప్పటికే 60% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. షెడ్యూల్ షెడ్యూల్ కి అప్డేట్స్ ఇస్తూ OG సినిమాపై సాలిడ్ బజ్ ని క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ఈ మూవీ నుంచి పవన్ కళ్యాణ్ స్టిల్ బయటకి వస్తే చాలు సోషల్ మీడియాలో షేక్ అవుతోంది. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోస్ కొన్ని బయటకి వచ్చి ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతున్నాయి.
ఖుషి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి ఆ రేంజ్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ చూడని ఫాన్స్ కి సుజిత్ ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీ అవుతున్నట్లు ఉన్నాడు. గ్యాంగ్ స్టర్ డ్రామా, ముంబై బ్యాక్ డ్రాప్, మార్షల్ చేయనున్న పవన్ కళ్యాణ్, OG టైటిల్… అసలు ఈ ఎలిమెంట్స్ ని కలిపి సుజిత్ పవన్ కళ్యాణ్ తో ఎలాంటి సినిమా ప్లాన్ చేస్తున్నాడో తెలియట్లేదు కానీ థియేటర్స్ కి వచ్చే ఫాన్స్ కి మాత్రం పూనకాలు రావడం గ్యారెంటీ. ఆ పూనకాలని మరింత పెంచడానికి థమన్ ఎలాగూ డ్యూటీ ఎక్కుతాడు కాబట్టి OG పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మైల్ స్టోన్ గా నిలిచిపోయే అవకాశం ఉంది. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్ లాంటి మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ నటిస్తున్నారు.