పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ మళ్లీ కలుసుకున్నారు. ఈ మేరకు వీరిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పవన్, రేణుదేశాయ్ దంపతుల తనయుడు అకీరా నందన్ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా సోమవారం ఈ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నగరంలోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూలులో అకీరా గ్రాడ్యుయేషన్ డే ఘనంగా జరిగినట్లు ఫోటోలను చూస్తే తెలుస్తోంది.
Tollywood: హీరోల్లో మార్పు వస్తుందా..? బడ్జెట్స్ తగ్గుతాయా..?
అకీరా కోసమే పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్‌కు వచ్చి తన ఫ్యామిలీతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. పవన్, రేణు దేశాయ్ భార్యాభర్తలుగా విడిపోయి విడాకులు తీసుకుని దూరంగా ఉన్నా తమ ఇద్దరి పిల్లల కోసం అప్పుడప్పుడు తమ పట్టింపులను పక్కన పెడుతున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలూ రేణుదేశాయ్ దగ్గరే ఉంటున్నారు. అకీరా నందన్ ప్రస్తుతం 17వ ఏటలోకి వచ్చాడు. మొత్తానికి అకీరా నందన్ తన స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా హీరోలా మెరిశాడు. కాగా చాన్నాళ్ల తర్వాత పవన్, రేణుదేశాయ్, వాళ్లిద్దరి పిల్లలు ఒకే ఫ్రేములో కనిపించడంతో పవర్‌స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.