మ్యాచో హీరో గోపీచంద్, రాశీఖన్నా జంటగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పక్కా కమర్షియల్. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీవాసు నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరును పెంచేసిన చిత్రబృందం.. ప్రమోషన్లో భాగంగా రిలీజ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఇది నిజంగా పక్కా కమర్షియల్ బొమ్మ అని తెలుస్తోంది. “పాతికేళ్ల తర్వాత లాయర్ కోటు వేస్తున్నావు అంటే ఎంత ఎలివేషన్ ఉండాలి” అంటూ రాశీఖన్నా డైలాగ్ తో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. గోపీచంద్ పవర్ ఫుల్ యాక్షన్, రాశీ కామెడీ, మారుతి మార్క్ కామెడీ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయని చెప్పొచ్చు.
ఇక గోపీచంద్ తండ్రి సత్యరాజ్ ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. తండ్రీకొడుకులు విడాకులు ఇప్పించండి అంటూ రాశీ చెప్పిన డైలాగ్ ను బట్టి సత్య రాజ్ కు కొడుకు గోపీచంద్ కు పడదని, వారి మధ్య నడిచే కేసే సినిమాగా అర్ధమవుతోంది. ఏ కేసునైనా డబ్బు తీసుకొనే గెలిపించే కొడుకు.. నిజాయితీకి మారుపేరుగా నిలిచే తండ్రికి మధ్య జరిగే యుద్ధం లో ఎవరు గెలిచారు..? ఎవరు ఓడారు..? అనేది తెలియాలంటే సినిమ చూడాల్సిందే. రావు రమేష్, వరలక్ష్మీ శరత్ కుమార్ గెటప్స్ అదిరిపోయాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఫ్రెష్ ఫీల్ ను కలిగిస్తోంది. మొత్తానికి ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశాడు మారుతి.. మరి ఈసారి గోపీచంద్ పక్కా కమర్షియల్ హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.