Pakka Commercial ott date fixed: మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన పక్కా కమర్షియల్ మూవీ జూలై 1న థియేటర్లలో విడుదలైంది. మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. యూవీ క్రియేషన్స్, జీఎ2 పిక్చర్స్ బ్యానర్‌లపై బన్నీవాసు, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా తాజాగా వెల్లడించింది. ఆగస్టు 5 నుంచి…
మన తెలుగు సినిమాకు ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పెరిగింది. ఇంతకు ముందు టాప్ హీరోల సినిమాలే విదేశాలలో విడుదల అయ్యేవి. ఇక అమెరికాలో అయితే మన కంటే ఓ రోజు ముందే రిలీజ్ అవుతుండేవి. అయితే మారిన పరిస్థితుల్లో అలా ఓ రోజు ముందు ప్రదర్శించటం వల్ల తెలుగు రాష్ట్రాలలో ఆ యా సినిమాల ఫలితాలు ప్రభావితం చేస్తున్నాయి. సాంకేతికత పెరిగిన నేపథ్యంలో షో ఆరంభం అయిన నిమిషం నుంచే అలా ఉంది.. ఇలా…
మారుతి ట్రాక్ రికార్డ్ ప్రకారం.. మినిమం గ్యారంటీ సినిమా తీయగలడు అనే టాక్ ఉంది. అలాంటి మారుతికి ఇప్పుడు భారీ లైనప్ ఉండడం విశేషం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు స్టార్ హీరోలు మారుతితో లైన్లో ఉన్నట్టు తెలుస్తోంది. అది కూడా కుర్ర హీరో నుంచి సీనియర్ హీరోలు ఉన్నారు.. ఇంతకీ మారుతితో ఈ స్టార్ హీరోలు సినిమాలు చేస్తారా..! ‘ఈరోజుల్లో’ సినిమాతో మెగా ఫోన్ పట్టిన మారుతి.. ప్రేమకథా చిత్రమ్.. భలే…
ఇప్పుడు భారత చిత్రసీమలోని భాషా బేధాలు పూర్తిగా తొలగిపోయిన సంగతి తెలిసిందే! అక్కడి దర్శకులు ఇక్కడి హీరోలతోనో, ఇక్కడి దర్శకులు అక్కడి హీరోలతోనో జత కట్టేస్తున్నారు. ముఖ్యంగా.. టాలీవుడ్, కోలీవుడ్‌లో ఈ క్రేజీ కాంబోలో బోలెడన్నీ కుదిరాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో కలయిక చేరనున్నట్టు కనిపిస్తోంది. అదే.. డైరెక్టర్ హరి, మన మ్యాచో మ్యాన్ గోపీచంద్. తమిళ దర్శకుడు హరి ఎప్పట్నుంచో తెలుగులో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ముఖ్యంగా.. సింగం సిరీస్‌తో తనకు తెలుగులోనూ మంచి…
ఏదైనా ఒక వస్తువు కానీ, ఒక సినిమా కానీ జనాల్లోకి వెళ్ళాలి అంటే కావాల్సింది ప్రమోషన్స్.. అది లేకపోతే ఎన్నని కోట్లు పెట్టి సినిమా తీసినా ప్రేక్షకుల వద్దకు చేరదు.
టాలీవుడ్‌లో ప్రతి వారం కొత్త సినిమా విడుదలవుతోంది. ఈ వారం (జూలై 1) కూడా పలు కొత్త సినిమాలు విడుదలకు క్యూ కట్టాయి. అయితే వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్న నేపథ్యంలో ఈ వారం విడుదలయ్యే సినిమాలపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. మరి ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలేంటో చేసేద్దాం పదండి. పక్కా కమర్షియల్ గోపీచంద్ అంటే యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. దర్శకుడు మారుతి కూడా సపరేట్ ట్రాక్‌లో సినిమాలను…
పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి.. తొలుత అభిమానుల్లో జోష్ నింపేశారు. తానొచ్చింది యూనిట్ కోసం కాదని, మీకోసమేనంటూ అభిమానుల్ని ఉద్దేశంచి చెప్పగానే.. ఆ వేదిక ఒక్కసారిగా ఫ్యాన్స్ కేరింతలతో హోరెత్తిపోయింది. ఈ సినిమా కోసం పని చేసిన వాళ్లందరూ తన కుటుంబ సభ్యుల్లాంటి వాళ్లేనని, వాళ్ల కోసం తను తప్పకుండా రావాల్సిందేనని నిర్ణయించుకొని ఈ ఈవెంట్ కి వచ్చానన్నారు. అయితే.. ఈ ఈవెంట్ కి వచ్చి, మిమ్మల్ని…
విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా ‘పక్కా కమర్షియల్’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. బన్నీ వాస్ నిర్మాతగా మ్యాచో హీరో గోపీచంద్‌తో చేస్తున్న ఈ సినిమా జూలై 1న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన…
గోపీచంద్ హీరోగా విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మాతగా జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై గోపీచంద్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ట్రైలర్, టీజర్, పాటలకు చక్కటి స్పందన వచ్చిన నేపథ్యంలో తాజాగా సినిమా నుంచి రాశీ ఖన్నా లుక్ విడుదల చేసారు మేకర్స్. ఇందులో సీరియల్ ఆర్టిస్టుగా అందనిపీ నవ్వించడానికి రెడీ అయింది రాశీఖన్నా. ట్రైలర్ ని మించి సినిమాలో రాశీ…