NTR: నందమూరి నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. తాత పేరును నిలబెడుతూ నందమూరి లెగసీని ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. కొద్దిగా సమయం చిక్కినా ఇద్దరు కొడుకులతో వెకేషన్ ఎంజాయ్ చేస్తాడు. ఎన్టీఆర్ కు ఇద్దరు కుమారులు.. అభయ్ రామ్, భార్గవ్ రామ్. ఇక పిల్లలకు సోషల్ మీడియాను అలవాటు చేయకుండా పెంచుతున్నారు ఎన్టీఆర్- ప్రణతి. చాలా రేర్ ఆ వీరి ఫోటోలు బయట కనిపిస్తూ ఉన్తయి. అది కూడా ఎన్టీఆర్ పోస్ట్ చేస్తే తప్ప.. ఎక్కడా దొరకవు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఇప్పుడిప్పుడే స్కూల్ కు వెళ్తున్నారు. తన పిల్లల గురించి చెప్పాలంటే.. అభయ్ చాలా సైలెంట్.. ప్రశ్నల బుక్. కొన్నిసార్లు వాడు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక పారిపోతూ ఉంటాను. వాడంటే అందుకే నాకు భయం అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఇక చిన్నవాడు భార్గవ్.. అల్లరి పిడుగు అని చెప్పుకొచ్చాడు. భార్గవ్.. చూస్తూ ఉండగానే పెద్దవాడు ఐపోయాడు. అప్పుడెప్పుడో ఎన్టీఆర్.. లండన్ వెకేషన్ కు వెళ్ళినప్పుడు భార్గవ్ తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఇప్పటివరకు ఈ చిన్నారులు ఎలా ఉన్నారు అనేది ఎవరికి తెలియదు.
Allu Arjun: షారుఖ్ సినిమాలో బన్నీ.. సైలెంట్ గా షూటింగ్ కూడా కానిచ్చేసాడంట..?
ఇక తాజాగా ఎన్టీఆర్ చిన్నకొడుకు భార్గవ్ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. భార్గవ్ రామ్ .. తన ఫ్రెండ్ బర్త్ డే కు తానే పెయింట్ చేసిన ఒక పెయింటింగ్ ను గిఫ్ట్ గా ఇస్తున్నట్లు కనిపిస్తోంది. వెనుక బర్త్ డే పార్టీ జరుగుతుండగా.. తాను, తన ఫ్రెండ్ గీసిన బొమ్మలను చూపిస్తూ నవ్వులు చిందిస్తున్నాడు భార్గవ్. ముద్దుగా.. బొద్దుగా భార్గవ్.. అచ్చు తండ్రి ఎన్టీఆర్ లానే కనిపిస్తున్నాడు. ముఖ్యంగా ఆ కళ్లు.. చిన్నప్పుడు ఎన్టీఆర్ ను చూసినట్లే ఉన్నాయని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక ఈ ఫోటోపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమదైన రీతిలో స్పందిస్తున్నారు. లిటిల్ టైగర్.. మీ నాన్నలానే ఉన్నావ్ అని కొందరు.. అబ్బబ్బ.. ఎంత ముద్దుగా ఉన్నాడు సార్.. దిష్టి తగేలేనేమో అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు.