Allu Arjun: టాలీవుడ్ రోజురోజుకు తన ఖ్యాతిని పెంచుకుంటూ వెళ్తోంది. ఒకప్పుడు బాలీవుడ్ హీరోలు.. తెలుగు సినిమాల్లో కనిపిస్తే గొప్పగా ఫీల్ అయ్యేవారు. కానీ, ఇప్పుడు తెలుగు హీరోలు బాలీవుడ్ సినిమాలో గెస్ట్ పాత్రలో చేయమని వారే అడుగుతున్నారు. టాలీవుడ్ రేంజ్ ఇలా మారుతుందని బాలీవుడ్ వాళ్లు అస్సలు ఉహించి ఉండరు. ఇప్పటికే మన స్టార్ హీరోల బాలీవుడ్ డెబ్యూలు సిద్దమయి పోయాయి. ప్రభాస్.. ఆదిపురుష్, ఎన్టీఆర్.. వార్ 2.. త్వరలోనే అల్లు అర్జున్ సైతం బాలీవుడ్ డెబ్యూ ఇవ్వనున్నాడు. దీనికి ముందే బన్నీ ఒక బాలీవుడ్ సినిమాలో క్యామియో రోల్ లో కనిపించనున్నాడు. షారుఖ్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జవాన్. షారుఖ్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ పై ఈ సినిమా భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం షారుఖ్ తో పాటు అల్లు అర్జున్ కూడా కనిపించనున్నాడని వార్తలు గుప్పుమన్న విషయం తెల్సిందే. అయితే ఆ వార్తలో నిజం లేదని వార్తలు వచ్చాయి. దీంతో అభిమానులు కొద్దిగా నిరాశ చెందారు కూడా.
Niharika Konidela: మొన్న చైతన్య.. నేడు నిహారిక.. ఏంటీ విడాకుల గోల..?
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. జవాన్ లో అల్లు అర్జున్ ఒక క్యామియో రోల్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలు అబద్దం కాదట. క్లైమాక్స్ లో షారుఖ్ కు హెల్ప్ చేసే హీరోగా బన్నీ రంగంలోకి దిగనున్నాడట. ఇప్పటికే బన్నీకి సంబంధించిన సీన్స్ కూడా షూటింగ్ ను పూర్తిచేసుకున్నాయని టాక్ నడుస్తోంది. అంతేకాకుండా త్వరలో రిలీజ్ కాబోయే టీజర్ లో బన్నీ లుక్ ను కూడా చూపించనున్నారట. ఈ వార్త తెలియడంతో బన్నీ అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో బన్నీతో పాటు దీపికా పదుకొనే కూడా క్యామియో రోల్ లో కనిపించనుంది. మరి ఈ సినిమాలో వీరిద్దరూ ఎలాంటి పాత్రల్లో కనిపిస్తారో చూడాలి. జూన్ 2 న జవాన్ మూవీ అన్ని భాషల్లో రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో షారుఖ్.. అన్ని భాషలు ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో చూడాలి.