కోలీవుడ్ లవ్ బర్డ్స్ నయన్ తార- విఘ్నేష్ శివన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు రోజూ వింటూనే ఉన్నాం. కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్న ఈ జంట ఈ మధ్యనే ఎంగేజ్ మెంట్ చేసుకున్నారన్న విషయం తెల్సిందే. అదికూడా నయన్ ఒక షో లో రివీల్ చేయడంతో కన్ఫర్మ్ అయ్యింది. దీంతో ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు నయన్- విఘ్నేష్ ల వివాహం అయిపోయినట్లు తెలిసి షాక్ అవుతున్నారు. ఈ జంట ఇప్పటికే ఎవరికి తెలియకుండా పెళ్లి చేసేసుకున్నారని, ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ ఇటీవల నయన్ ఒక టెంపుల్ లో నుదుటున బొట్టుతో కనిపించి షాక్ ఇచ్చింది.
కరోనా లాక్ డౌన్ తరువాత వీలుచిక్కినప్పుడలా ఈ లవ్ బర్డ్స్ ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా తమిళనాడులోని ఓ అమ్మావారి ఆలయానికి వెళ్లారు. అక్కడ పూజ ముగించుకొని బయటికి వచ్చిన నయన్ నుదుటిన కుంకుమతో దర్శనమిచ్చింది. దీంతో వీరిద్దరికి ఎప్పుడో పెళ్లి అయిపోయింది.. కావాలనే ఈ జంట ఆ విషయాన్ని దాస్తున్నారు అంటూ చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందొ తెలియాలంటే ఈ ప్రేమ జంట నోరు విప్పక తప్పదు.