దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో మాస్టర్ సినిమా తర్వాత వస్తున్న మూవీ లియో. అనౌన్స్మెంట్ తోనే ఆకాశాన్ని తాకే అంచనాలని క్రియేట్ చేసిన ఈ మూవీ అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ తో లియో సినిమాపై అంచనాలని పెంచే పనిలో ఉన్నారు మేకర్స్. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ కానున్న లియో మూవీ తెలుగు థియేట్రికల్ రైట్స్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ నాగ వంశీ సొంతం చేసుకున్నాడు. నాగ వంశీ తన సినిమాలని ప్రమోట్ చేయడంలో చాలా స్ట్రాంగ్ గా, అగ్రెసివ్ గా ఉంటాడు. లియో విషయంలో మాత్రం నాగ వంశీ ఇంకా స్పీడ్ పెంచలేదు. తన బ్యానర్ నుంచి వస్తున్న ‘మ్యాడ్’ మూవీ ప్రమోషన్స్ పైనే దృష్టి పెట్టిన నాగ వంశీ, ఈరోజు మార్నింగ్ షోస్ నుంచి మ్యాడ్ మూవీకి హిట్ టాక్ సొంతం చేసుకున్నాడు. యంగ్ హీరోలతో హిట్ కొట్టిన నాగ వంశీ, ఇక లియో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తాడు అనుకుంటే “నేను డబ్బింగ్ సినిమా తీసుకోవడం ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి కూడా. ఇకపై డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేయను” అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.
లియో సినిమా విషయంలో నాగ వంశీ ఎందుకు అలా రెస్పాండ్ అయ్యాడో తెలియదు కానీ ధనుష్, దుల్కర్ లాంటి సౌత్ స్టార్స్ తో కూడా స్ట్రెయిట్ తెలుగు సినిమాలని, మల్టీలాంగ్వేజ్ సినిమాలని ప్రొడ్యూస్ చేస్తూ బిజీగా ఉండి… మధ్యలో ఈ డబ్బింగ్ సినిమాల గోల ఎందుకులే అనుకున్నాడో లేక విజయ్ ని ధనుష్ అండ్ దుల్కర్ సల్మాన్ లా హైదరాబాద్ కి వచ్చి లియో సినిమాని ప్రమోట్ చేయడని లైట్ తీసుకోని కూడా ఉండొచ్చు. లియో సినిమా రిలీజ్ అయ్యే సమయంలో బాలయ్య భగవంత్ కేసరి కూడా థియేటర్స్ లోకి రానుంది. నాగ వంశీ లియో సినిమాని ఎక్కువగా ప్రమోట్ చేయకపోవడం భగవంత్ కేసరి సినిమాకి మరింత కలిసి రానుంది. ఇక నాగ వంశీ, బాబీ డైరెక్షన్ లో బాలయ్యతో ఒక సినిమా చేస్తున్నాడు, ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీ త్వరలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది.