కరోనా వల్ల ఏ ఇండస్ట్రీకైనా మేలు జరిగింది అంటే అది మలయాళ పరిశ్రమకే. హారర్, క్రైమ్ థ్రిల్లర్స్ మాత్రమే కాదు ఫ్యామిలీ ఎంటర్ టైనర్లను ఓటీటీలో దించి ఓవరాల్ ఇండియన్ ఇండస్ట్రీ చూపు తన వైపు తిప్పుకుంది. గ్రిప్పింగ్ కాన్సెప్టులతో, స్క్రీన్ ప్లేతో గూస్ బంప్స్ తెప్పించింది. ఆ టైంలో వచ్చిన ఓ సినిమానే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అప్పట్లో ఓటీటీలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తర్వాత తమిళంలో, ఇప్పుడు హిందీలో రీమేకయ్యింది.
Also Read : Marvel Studios : కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్.. కాంపిటీషన్ ను తట్టుకుంటుందా.?
తాజాగా ఈ ది గ్రేట్ ఇండియన్ కిచెన్ హిందీ రీమేక్ మిసెస్ హిందీ రీమేక్ రీసెంట్లీ జీ5 ఓటీటీలో రిలీజైంది. విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా మహిళా ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. మంచి రివ్యూస్ రాబట్టుకోవడమే కాదు రికార్డులు బద్దలు కొడుతుంది. గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ఓటీటీ మూవీగా నిలిచింది. అలాగే జీ5 మునిపెన్నడూ చూడని వ్యూస్ దక్కించుకుంది. ఓపెనింగ్ వీకెండ్ లో 150 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించింది. ఆరతి కాదవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దంగల్ ఫేమ్ సాన్యా మల్హోత్రా, నిశాంత్ దహియా కీ రోల్స్ చేశారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్ ను పెళ్లి చేసుకుని వంటింటికే పరిమితం అయి, మూడు పూటలా వండి పెడుతూ ఓ గృహీణి ఎదుర్కున్న సమస్యలు, అలాగే ఆమె మనోభావాలను తెరపై చక్కగా మలిచాడు దర్శకుడు. అటు మలయాళం, ఇటు తమిళ్ లో సూపర్ హిట్ అయిన గ్రేట్ ఇండియన్ కిచెన్ ఇప్పుడు బాలీవుడ్ లోను అదరగొడుతుంది.