మార్వెల్ స్టూడియో నుండి సినిమాలొస్తున్నాయంటే హాలీవుడ్ లోనే కాదు ఇండియన్ ఇండస్ట్రీ కూడా చాలా ఇంటస్ట్రింగ్ గా ఎదురు చూస్తుంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా సినిమాలను చూస్తుండటంతో ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. అందుకే మార్వెల్ స్టూడియో నుండి వచ్చిన ప్రతి సినిమాను ఇక్కడ కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సిరీస్ నుండి కొత్త చాప్టర్ వచ్చేసింది. అదే కెప్టెన్ అమెరికా : బ్రేవ్ న్యూ వరల్డ్. ఈ శుక్రవారమే ప్రేక్షకులను పలకరించింది.
Also Read : Thaman : తమిళ సినిమాలో యాక్టర్ గా తమన్.. ప్రోమో రిలీజ్
2019లో వచ్చిన అవెంజర్స్ ఎండ్ గేమ్ లో స్టీవ్ రోజర్స్ సామ్ విల్సన్ కు షీల్ట్ ఇస్తాడు. ఇక్కడ నుండి కొత్త కెప్టెన్ అమెరికా వచ్చాడు. ఫిబ్రవరి 14న అనగా నేడు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజైంది. ఇప్పటికే హాలీవుడ్ లో ప్రీమియర్స్ వేశారు మేకర్స్. కెప్టెన్ అమెరికాగా ఆంటోనీ మాక్ మెస్మరైజ్ చేశాడు. జూలియస్ ఓనా దర్శకత్వం వహిస్తున్న కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ లో దిగ్గజ నటుడు హారిసన్ ఫోర్డ్ కీ రోల్ లో కనిపించాడు. అలాగే పాల్కన్, రెడ్ హల్క్ పాత్రలు సినిమాకు అదనపు ఆకర్షణ. అయితే రీసెంట్లీ మాలీవుడ్ లో ఈ మార్వెల్ న్యూ వరల్డ్ ను ప్రీమియర్స్ వేయగా మిక్స్ డ్ టాక్ వచ్చింది. సినీ విమర్శకులు సైతం పెదవి విరిచారు. హాలీవుడ్ సంగతి సరే మార్వెల్ సినిమాలకు పిచ్చ ఫ్యాన్స్ ఉన్న ఇండియాలో మాత్రం టఫ్ కాంపిటీషన్ ఉంది. ఇదే ఫిబ్రవరి 14న ఛావాలాంటి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ ఇలాంటి పోటీని తట్టుకుని కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్ ఎంత వరకు ఇండియన్ మార్కెట్ ను కొల్లగొడుతుందో చూడాలి.