RC16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత చరణ్ నటిస్తున్న చిత్రం RC16. ఉప్పెన చిత్రంతో నేషనల్ అవార్డును అందుకున్న బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో పీరియాడికల్ జోనర్ లో ఈ సినిమా ఉండబోతుంది. ఇక ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా మొదలవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూసారు. రెండు రోజుల క్రితమే ఆ ముచ్చట కూడా తీరిపోయింది. ఇక ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా.. ? లీక్స్, ఫొటోస్ ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి ఇందులో ఎవరెవరు నటిస్తారో తెలుసుకోవడానికి అభిమానులు ఎంతో ఆత్రుతగా చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి.
తాజాగా మరో టాలెంటెడ్ హీరోను బుచ్చిబాబు దింపుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అతనే మలయాళ హీరో ఆంటోనీ వర్గేసే. ఈ పేరు గతేడాది నుంచి తెలుగువారికి కూడా పరిచయమయ్యింది. నీల నిలవే సాంగ్ తెలుగులో కూడా ఫేమస్ అయ్యిన సంగతి తెల్సిందే. ఆ సాంగ్ ఉన్న సినిమా ఆర్డీఎక్స్. మలయాళ సినిమా.. ఓటిటీలో తెలుగు భాషలో కూడా ఉంది. ఇక ఆ సినిమాలో నటించిన హీరోనే ఆంటోనీ. ఈ సినిమా తరువాత ఈ ఏడాది మలయాళ ఇండస్ట్రీని షేక్ చేసిన మంజుమ్మేల్ బాయ్స్ లో కీలక పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ హీరో నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. ఇక తాజాగా అతడి నటనకు మెచ్చి.. RC16 లో ఒక కీలక పాత్రకోసం బుచ్చిబాబు ఆంటోనీని తీసుకొనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే చర్చలు కూడా పూర్తి అయ్యాయని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ, ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. స్టార్ క్యాస్టింగ్ తో సినిమాను బుచ్చి.. షేక్ ఆడిస్తాడనే చెప్పాలి. మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.