Miheeka Bajaj: సాధారణంగా మ్యాగజైన్స్ పై ఫిల్మ్ స్టార్ ఫొటోస్ ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్ ఫొటోస్ ను ప్రింట్ చేస్తారు. వారి ఫిట్ నెస్ గురించి, అచీవ్ మెంట్స్ గురించి రాస్తూ కొద్దిగా హాట్ గా ఉన్న పిక్ తో మ్యాగజైన్ కవర్ ఫొటోస్ ఉంటాయి. ఇక హలో మ్యాగజైన్ గురించి చాలామందికి తెలుసు. సినీ సెలబ్రిటీల కవర్ పిక్స్ తో కలర్ ఫుల్ గా ఉంటుంది. అయితే తాజాగా ఆ హలో మ్యాగజైన్ పై ఒక హీరో గారి భార్య సందడి చేసింది. హీరోయిన్ కు మించిన అందంతో అదరగొట్టింది. ఇంతకు ఆ హీరో ఎవరు.. ఆయన భార్య ఎవరు అనేగా.. ఇంకెవరో కాదు.. మన భల్లాల దేవుడు రానా దగ్గుబాటి.. ఆయన భార్య మిహీకా బజాజ్. కరోనా సమయంలో రానా, మిహీకాను వివాహమాడాడు. వీరి పెళ్లి జరిగి ఇప్పటికీ మూడేళ్లు కావొస్తుంది. ఆమె ఒక ఇంటీరియర్ డిజైనర్. బిజినెస్ లో ఆమె కూడా బాగానే సంపాదిస్తోంది.
Kajol: కాజోల్ కాలికి గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్
ప్రస్తుతం అత్తగారింట్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న మీహికా తాజాగా హలో మ్యాగజైన్ పై హొయలు పోతూ ఫోజులు ఇచ్చింది. ఫ్లోరల్ లెహంగాలో ఎంతో అందంగా కనిపించింది. మెట్లపై కూర్చోని.. లెహంగాని చూపిస్తూ నవ్వుతూ కనిపించింది. ఇక ఇంకో ఫొటోలో చీరలో మెస్మరైజ్ చేసింది. ఇక ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులుఅస్సలు హీరోయిన్ కన్నా అందంగా ఉంది. హీరోయిన్లు సైతం దిగదుడుపే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మిహీకా ప్రెగ్నెంట్ అంటూ వచ్చిన వార్తలను ఆమె ఖండించింది. ఏదైనా ఉంటే తాను చెప్తానని, ఇలాంటి ఫేక్ రూమర్స్ క్రియేట్ చేయొద్దని కూడా తెలిపింది. దీంతో ఆ రూమర్స్ కు చెక్ పడ్డాయి.