Kajol: బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ రీ ఎంట్రీతో అదరగొడుతుంది. ఈ మధ్యనే ది ట్రైల్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది. లాయర్ గా కాజోల్ నటన సిరీస్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది. అమెరికన్ వెబ్ సిరీస్ ది గుడ్ వైఫ్ కు రీమేక్ గా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. ఇక ఈ సిరీస్ కు సీజన్ 2 రానున్న విషయం కూడా తెల్సిందే. ప్రస్తుతం ఆ షూటింగ్ లో పాల్గొంటున్న కాజోల్.. మరో రెండు ప్రాజెక్ట్స్ కు సైన్ చేసినట్లు సమాచారం. అయితే గత కొన్నిరోజుల క్రితం కాజోల్ కాలికి గాయం అయ్యినట్లు తెలుస్తోంది. ఆమె కాలికి గాయం అయ్యిందని తెలియడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అస్సలు ఆమెకు ఏమైంది.. ? ఆ కాలికి దెబ్బ ఎలా తగిలింది అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు.
Sunil : తమిళ్ సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ కమెడియన్..
తాజాగా కాజోల్ చేతికర్ర సహాయంతో నడుస్తున్న ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కాలికి దెబ్బ తగలడంతో వైద్యులు కొన్నిరోజులు ఇంట్లోలే రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో ఆమె ఎక్కడికి కదలడం లేదని, ఎక్కడకు వెళ్లినా కర్ర సహాయంతో వెళ్తుందని తెలుస్తోంది. షూటింగ్ సమయంలో ఏదైనా దెబ్బ తగిలిందా.. ? లేదా ఇంట్లోనే ఆమె కాలికి దెబ్బ తగిలిందా అనేది తెలియాల్సి ఉంది. ఈ వీడియో చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. ఇంకోపక్క కాజోల్ .. కాలికి దెబ్బ తగలడం వలన షూటింగ్స్ గ్యాప్ ఇచ్చిన్నట్లు సమాచారం అందుతున్నది. కాజోల్ త్వరగా కోలుకొని సెట్ లో అడుగుపెట్టాలని అభిమానులు కోరుతున్నారు.