Meher Ramesh Disaster Sentiment for Cricket World Cup: మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళా శంకర్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి మిక్స్డ్ టాక్ అందుకుంది. కొందరు సినిమా చూసి భలే ఉందంటుంటే… మరికొందరు మాత్రం దారుణంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం అనే సినిమాని తెలుగులో భోళా శంకర్ పేరుతో రీమేక్ చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర నిర్మాతగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ కనిపించింది. ఇక ఆమె ప్రియుడి పాత్రలో సుశాంత్ ఒక అతిథి పాత్రలో నటించాడు.
Anasuya Bharadwaj: ‘బేగం హజ్రత్ మహల్’గా మారిపోయిన అనసూయ భరద్వాజ్
వీరు మాత్రమే కాకుండా జబర్దస్త్ నటీనటులతో పాటు శ్రీముఖి, రష్మీ కూడా నటించారు. ఈ సినిమాకి ఒకరకంగా డిజాస్టర్ టాక్ వచ్చిందని చెప్పవచ్చు. దీంతో ఇప్పుడు కొత్త పోలికను తెరమీదకు నెటిజన్లు తెస్తున్నారు. అదేంటంటే మెహర్ రమేష్ దర్శకత్వంలో 2011వ సంవత్సరంలో ఎన్టీఆర్ హీరోగా శక్తి అనే సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా కూడా అలాగే డిజాస్టర్ టాక్ అందుకుంది. కానీ ఆ ఏడాది ఇండియా క్రికెట్ లో వరల్డ్ కప్ సంపాదించింది. ఇక 2013వ సంవత్సరంలో కూడా వెంకటేష్, తాప్సీ హీరో, హీరోయిన్లుగా మెహర్ రమేష్ షాడో అనే సినిమా డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా కూడా డిజాస్టర్లకే డిజాస్టర్ గా నిలిచింది. ఆ సినిమా దెబ్బకి మెహర్ రమేష్ ఇన్నాళ్ల పాటు సినిమాలకు దూరం అయిపోయాడంటే ఆ సినిమా ఎంతలా ఇబ్బంది పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఆ ఏడాది కూడా ఇండియాకి క్రికెట్లో వరల్డ్ కప్ లభించింది. ఇక ఈ లెక్కన చూస్తుంటే ఈ ఏడాది కూడా ఇండియాకి క్రికెట్ కప్పు రావచ్చేమో అనే అంచనాలతో నెటిజన్లు మీమ్స్ చేస్తున్నారు. ఆ మీమ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.