ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు స్వరూప్ రాజ్. ఈ సినిమా తరువాత కొద్దిగా గ్యాప్ తీసుకున్నా ఈ దర్శకుడు మరో ప్రయోగాత్మకమైన చిత్రం మిషన్ ఇంపాజిబుల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాప్సీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 1 న రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నేడు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఇక ఏ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..” కొన్ని ఫంక్షన్లకు ఆబ్లిగేషన్స్ మీద వెళ్తాము .. మరికొన్ని ఫంక్షన్స్ కి ప్రేమతో వస్తాం.. ఇక్కడకు నేను ఈ యూనిట్ మీద నిర్మాత, సోదరుడు నిరంజన్ రెడ్డి పై ఉన్న ప్రేమతో వచ్చాను. రెండు రోజుల ముందు ఆయన ఇంటికి వచ్చి, తాప్సీ, ముగ్గురు పిల్లలతో కలిసి మిషన్ ఇంపాజిబుల్ సినిమ తీశాను.. డైరెక్టర్ వచ్చి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ డైరెక్టర్ స్వరూప్ అని చెప్పాడు. దీంతో చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించింది. సినిమా చూసి, నచ్చాకనే ఈ ఈవెంట్ కి రావాలని కోరారు.
సినిమా చూడకపోయినా వేడుకకు వచ్చేవాడిని.. కానీ సినిమా చూసాకా చెప్తున్నాను పెంటాస్టిక్.. ఈ ముగ్గురు పిల్లలు నటన అదిరిపోయింది. నాకు పిల్లల నటన చూసాకే సినిమాల్లో నటించాలని కోరిక పుట్టింది. నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు ప్రభాకర్ అనే బాలనటుడు నటన చూసి హీరోగా అవ్వాలని అనుకున్నాను. పిల్లల నటనను ఎంతసేపైనా చూడాలనిపిస్తుంది. ఇక తాప్సీ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆమె నటించిన పింక్, బద్లా చూసాను. ఝుమ్మంది నాదం చిత్రంలో ఎంత క్యూట్ గా ఉన్న ఆమెనా ఈ సినిమాలు చేసింది అనుకున్నాను.
ఝుమ్మంది నాదం చూసి ఎంత బావుంది.. వావ్ అనుకున్నాను.. ఆ సమయంలో నేను పాలిటిక్స్ కి వెళ్ళిపోయి తనతో చేసే అవకాశాన్ని మిస్ అయ్యాను. ఒక్కోసారి ఇలాంటి వాళ్ళను చూసినప్పుడు నేనెందుకు పాలిటిక్స్ కి వెళ్ళనా..? కొన్నిసార్లు తప్పు చేశాను అనిపిస్తుంది.. ఏదిఏమైనా నిరంజన్.. ఈ అమ్మాయితో ఒక సినిమా చేసేలా చూడు. ఇక్కడ ఉన్న యంగ్ డైరెక్టర్స్ పేర్లు డ్రా లో వేసి.. ఎవరు వస్తే వారికి అవకాశం ఇస్తున్నాను” అంటూ సరదాగా నవ్వించారు చిరు. ఇక సినిమా సినిమా అయినా పెద్ద సినిమాలాగే ఉందని, ఆర్ఆర్ఆర్ కి ప్రమోషన్స్ అక్కర్లేదు కానీ ఇలాంటి చిన్న సినిమాలకు ప్రమోషన్స్ కావాలి. ఈ సమయంలో రాజమౌళి ని ప్రశంసించాలి. తెలుగు వారి ఖ్యాతి ప్రపంచ దేశాలకు పాకేలా చేస్తుంది అని చెప్పుకొచ్చారు.