మణిరత్నం పేరుకు కోలీవుడ్ డైరెక్టర్ కానీ.. ప్రాణం అంతా నార్త్‌పైనే. తన స్టోరీలో తమిళ వాసనలతో పాటు ఉత్తరాది టచ్ ఉండేలా చూసుకుంటారు. స్టోరీ, లోకేషన్స్ పరంగానే కాదు అక్కడి భామలకు ఇక్కడ బ్రేక్ ఇస్తుంటారు. బొంబాయితో మనీషా కొయిరాలాకు, ఇరువర్‌తో టబు, దిల్ సేతో ప్రీతి జింటాకు, యువతో ఇషా డియోల్‌కు ఇక్కడ క్రేజ్ వచ్చేలా చేశాడు. ఈ కేటగిరిలో కొంత మంది సౌత్ మూలాలతో పాటు నార్త్ కనెక్షన్స్ ఉన్న ముద్దుగుమ్మలు ఉన్నారు. ఐశ్వర్యరాయ్, మధుబాల, అదితిరావ్ హైదరీ ఇలా వీళ్లను కూడా తన డెన్‌లోకి ఆహ్వానించాడు. ఇప్పుడు వీరి జాబితాలోకి చేరింది శాన్య మల్హోత్రా.
Also Read : Rashmi : హాస్పిటల్ బెడ్ పై యాంకర్ రష్మీ.. అసలేమైందంటే..?
దంగల్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శాన్య మల్హోత్రాకు బదాయి హో, శకుంతల దేవీ, జవాన్, శ్యామ్ బహుదూర్ చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కానీ ఆమె పేరు ఓవర్ నైట్ మోత మోగిపోయేలా చేసింది మిసెస్. మలయాళ బొమ్మ ద గ్రేట్ ఇండియన్ కిచెన్ ఇది రీమేక్. ఓటీటీ ఫిల్మ్ అయినప్పటికీ శాన్య ఫెర్మామెన్స్‌కు ఫిదా అయిపోయారు ఉమెన్ ఆడియన్స్. ఈ సినిమా కాస్త నెగిటివిటీని అందుకున్నా మంచి రివ్యూస్ అండ్ రేటింగ్ వచ్చాయి . ఈ ఓటీటీ మూవీతో శాన్య పేరు ఆల్ ఇండస్ట్రీలో గట్టిగానే వినిపించింది. ఈ బాలీవుడ్ బ్యూటీకి సౌత్‌లో లైఫ్ ఇచ్చేందుకు తీసుకు వస్తున్నాడు టాప్ మోస్ట్ డైరెక్టర్ మణిరత్నం. కమల్-శింబుతో కాంబోలో వస్తోన్న థగ్ లైఫ్‌లో వన్ ఆఫ్ ది హీరోయిన్. రీసెంట్లీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఇందులో శాన్య అందరిని డామినెట్ చేసింది. త్రిష నామ్‌కే వాస్తాగా మిగిలిపోయింది. శింబుతో స్టెపులేసి మెస్మరైజ్ చేసిన శాన్య.. చెన్నై బ్యూటీకి కాంపిటీషన్ ఇచ్చేట్లే కనిపిస్తోంది. ఇవే కాదు.. బాలీవుడ్‌లో మరో మూడు ప్రాజెక్టులు చేస్తున్న కర్లీ హెయిర్ క్యూటీకి.. మణిరత్నం బ్రేక్ ఇస్తాడో లేదో తెలియాలంటే జూన్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే.