మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు, ‘మా’ ఎన్నికల సమయంలో పోటీ చేస్తూ సభ్యులందరికీ ఉచిత హెల్త్ చెకప్ లు చేయిస్తానని మాటిచ్చాడు. ఆ మాటని నిలబెట్టుకుంటూ ‘మా అసోసియేషన్’ లో ఉన్న 800 మంది సభ్యులకి, వారి కుటుంబ సభ్యులకి కూడా కాంటినెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో హెల్త్ చెకప్ నిర్వహించారు. ఈరోజు ఉదయం నుంచి బ్రేక్ ఫాస్ట్ ని ప్రోవైడ్ చేసి మరీ హెల్త్ చెకప్ చేస్తున్నారు. ఈ హెల్త్ చెకప్ సక్సస్ అవ్వడంతో మంచు విష్ణు టీం అండ్ కాంటినెంటల్ హాస్పిటల్ తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచు విష్ణు మాట్లాడుతూ… కాంటినెంటల్ హాస్పిటల్ చైర్మెన్ గురునాథ్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, డాక్టర్ మేఘనాథ్ రెడ్డిలకి ధన్యవాదాలు తెలిపాడు. పదివేలకి చేసే మాస్టర్ హెల్త్ చెకప్ ని ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ మెంబర్స్ కి ఫ్రీగా చేస్తున్నందుకు కృతఙ్ఞతలు తెలిపాడు మంచు విష్ణు. ఈ కార్యక్రమంలో మంచు విష్ణుతో పాటు, శివ బాలాజీ, మాదాల రవి కూడా పాల్గొన్నారు.
Read Also: Manchu Manoj: అతారింటికి బయలుదేరిన కొత్త జంట…