యంగ్ హీరో మంచు మనోజ్ మార్చ్ 3న భూమా మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఫిల్మ్ నగర్ లోని ఇంట్లో సినీ రాజకీయ ప్రముఖుల మధ్య ఘనంగా మంచు మనోజ్, మౌనిక రెడ్డిల వివాహం జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకున్న మంచు మనోజ్, ఈరోజు మౌనికా రెడ్డితో పాటు ఆళ్లగడ్డకి వెళ్లారు. కొత్త జంట ఇంట్లో నుంచి బయటకి వచ్చే ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంచు మనోజ్, మౌనిక రెడ్డి కాన్వాయ్ లో ఆళ్లగడ్డకి వెళ్లారు. ఆళ్లగడ్డ భూమా కుటుంబానికి ఆయువు పట్టు లాంటింది. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి బ్రతికున్న కాలం నుంచి భూమా కుటుంబానికి ఆళ్లగడ్డకి మధ్య విడదీయ లేని బంధం ఉంది. మంచు మనోజ్, మౌనిక రెడ్డి పెళ్లి చేసుకున్న తర్వాత మొదటిసారి ఆళ్లగడ్డలో అడుగు పెడుతుండడంతో అక్కడ వారికి టీడీపీ కేడర్ నుంచి, మంచు మనోజ్ అభిమానుల నుంచి, భూమా ఫ్యామిలీ అనుచరుల నుంచి ఘన స్వాగతం లభించింది.
Manchu Manoj Live
Read Also: Sania Mirza: సానియా మీర్జా ఫేర్‌వెల్ మ్యాచ్.. చివరి మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన స్టార్స్