Mahesh Babu : టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అగ్ర హీరోల్లో మహేశ్ కు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి మహేశ్ బాబు రీ రిలీజ్ ట్రెండ్ లో కూడా తన సత్తా చాటుతున్నారు. ఇప్పటికే ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రీ రిలీజ్ అవుతూ కోట్లు వసూళ్లు చేస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఒకే నెల గ్యాప్ లో మూడు సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. మహేశ్ బాబు ప్లాపుల్లో ఉన్నప్పుడు బ్రేక్ ఇచ్చిన భరత్ అనే నేను సినిమాను ఏప్రిల్ 26న రిలీజ్ చేస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్టర్. ఈ మూవీని ఇప్పుడు రీ రిలీజ్ చేసి మంచి హిట్ కొట్టాలని చూస్తున్నారు.
Read Also : Viral Video: జిమ్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి.. చివరికి ఏమైందో చూడండి (వీడియో)
దీని తర్వాత మే 30వ తేదీన ఖలేజా సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేశ్ బాబు చేసిన ఈ మూవీ.. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మూవీలో మహేశ్ బాబు నటన కూడా వెర్సటైల్ గా అనిపిస్తుంది. ఈ సినిమాను కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఒక రోజు గ్యాప్ లో అంటే మే 31న అతిథి సినిమా కూడా వస్తోంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో మహేశ్ కు మంచి క్రేజ్ తెచ్చింది. కానీ హిట్ కాలేదు. ప్లాపు సినిమాను కూడా రీ రిలీజ్ చేస్తున్నారు అంటే అది మహేశ్ ఫ్యాన్స్ మీద ఉన్న నమ్మకమే అని చెప్పుకోవాలి.