కొంత కాలంగా హృద్రోగాలతో భారత్‌లో చాలా మంది మరణించారు. డ్యాన్స్ వేస్తూ, వ్యాయామం చేస్తూ, అలా కూర్చుని చనిపోయిన వీడియోలు ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అయ్యాయి. సాధారణంగా కనిపిస్తున్న ప్రజలకు ఒక్కసారిగా గుండెపోటు రావడం, వెంటనే కుప్పకూలడం, ఆ తర్వాత మరణించడం.. ఇలా అన్నీ నిమిషాల్లోనే జరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో అలాంటి ఓ ఘటన వెలుగులోకి వచ్చింది.
READ MORE: India Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ లీడర్ హత్య.. భారత్ ఆగ్రహం..
జబల్పూర్ నగరం గోరఖ్‌పూర్ ప్రాంతంలోని జిమ్‌లో యతీష్ సింఘై అనే 52 ఏళ్ల వ్యక్తి వ్యాయామం చేస్తూ కుప్పకూలాడు. తోటి జిమ్ చేసే వాళ్లు, సిబ్బంది అతని సహాయం చేసేందుకు పరుగెత్తారు. సీపీఆర్, ఇతర అత్యవసర పద్ధతులను ప్రయత్నించారు. యతీష్‌కు మోసుకుని నగరంలోని భండారి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
READ MORE: MP YV Subba Reddy: విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఎటాక్..
యతీష్ సింఘై గోల్డ్స్ జిమ్‌కు రెగ్యులర్‌గా వస్తుంటాడని సిబ్బంది తెలిపారు. “సంఘటన జరిగిన రోజు కూడా యతీష్ ఉదయం 6:45 గంటల ప్రాంతంలో జిమ్‌కు చేరుకున్నాడు. వివిధ జిమ్ మెషీన్‌లను ఉపయోగించి ఎప్పటిలాగే తన వ్యాయామం ప్రారంభించాడు. అయితే, సెషన్ సమయంలో అతను అకస్మాత్తుగా నేలపై కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. గుండెపోటు రావడంతో చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు.” అని సిబ్బంది, పోలీసులు వెల్లడించారు.
हर्क्युलिस बनने की चाह सही पर शरीर की पुकार भी सुनिए 😪😪😪😪#MadhyaPradesh के #जबलपुर के गोरखपुर थाना इलाके के जिम में एक्सरसाइज के दौरान 52 वर्षीय यतीश सिंघई की हार्ट अटैक से मौत हो गई…#ShockingVideo #viralvideo #heartattack #Jabalpur #kuldeeppanwar pic.twitter.com/Xj0dkpgZyv
— Kuldeep Panwar (@Sports_Kuldeep) April 18, 2025