Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో ssmb28 లో మహేష్ నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. త్రివిక్రమ్- మహేష్ కాంబో ఎంత పడ్డ హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఈ కాంబోపై చాలా అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇక ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే.. మొదలు పెట్టడం.. ఆగిపోవడం.. జరుగుతోంది. పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని షూటింగ్ స్టార్ట్ చేశారు.. మధ్యలో మహేష్ తండ్రి కృష్ణ మృతి చెందారు. దీంతో కొద్దిరోజులు ఈ షూటింగ్ కు బ్రేక్ పడింది. ఆ తరువాత మొదలైన రెగ్యులర్ షూటింగ్ ను త్వరగా కంప్లీట్ చేస్తారు అనుకుంటే ఇంకా జాప్యం జరుగుతోంది అని అభిమానులు మండిపడుతున్నారు. అందుకు కారణం.. త్రివిక్రమ్ ఈ మధ్య షూటింగ్ వదిలేసి క్రికెట్ ఆడడమే.. సరే ఏదో కొద్దిసేపు రిలాక్సేషన్ కోసం ఆడి ఉంటారులే అనుకోని సరిపెట్టుకున్నారు. ఇక తాజాగా మహేష్ బాబు క్రికెట్ ఆడుతున్న ఒక వీడియో బయటకొచ్చింది. అయితే ఈ వీడియో ఎప్పటిదో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ssmb28 హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ అవుతోంది.
Brahma Mudi: కార్తీక దీపం లవర్స్ మొత్తం ఇప్పుడు బ్రహ్మముడి ఫ్యాన్స్ అంట
ఇక ఈ వీడియోలో మహేష్, వంశీ పైడిపల్లి, మెహర్ రమేష్,తదితరులు అందరూ క్రికెట్ ఆడుతూ కనిపించారు.. మెహర్, వంశీ ఫీల్డింగ్ చేస్తుండగా మహేష్ బ్యాటింగ్ చేయడానికి వచ్చి.. బ్యాట్ పట్టుకొని.. మరీ చిన్నగా ఉందండి బ్యాట్ అని చెప్పడం.. అందుకు మెహర్.. ఏంకాదు.. కానివ్వండి అంటూ బెన్ స్టాక్స్ అని అరవడం వినిపిస్తున్నాయి. ఇక ఆ బ్యాట్ తోనే బ్యాటింగ్ చేసిన మహేష్ రెండు సార్లు మిస్ అయినా.. మూడోసారి మంచి షాట్ కొట్టి ఔరా అనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. సినిమా పూర్తిచేయండి అయ్యా.. అంటే క్రికెట్ ఆడుకొంటున్నారు ఏంటి భయ్యా అని కొందరు.. అక్కడ త్రివిక్రమ్.. ఇక్కడ మహేష్ సరిపోయారు అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.. ఇక ఇంకొందరు మాత్రం అది ఇప్పటి వీడియో కాదని చెప్పుకొస్తున్నారు.
“Ee bat mari chinnaga vundandi” 😊
Meher : “Ben Stokes” 🔥
Cut shot 😍 . #SarileruNeekevvaru #SSMB28 https://t.co/Jn7pW1ILtI pic.twitter.com/hPziEQxtRJ
— Super⭐️ Fan 🦁 (@ravi_hitwicket) February 2, 2023